* వాలంటీర్ వ్యవస్థ పై పునరాలోచన ఖచ్చితం
* కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బయటకు తీయాలి
* ఏపీలోనే ఉండి ప్రజల సమస్యలు తీర్చాలి
* పాదయాత్రలు అలాగే బస్సు యాత్రలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... కొన్ని భారీ తప్పిదాల వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో 150 స్థానాలకు పైగా... ఎక్కువ స్థానాలు వైసిపికి గెలుచుకోగలిగింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి... ఓడలు బండ్లు అవుతాయి అన్న రీతిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అట్టర్ ఫ్లాఫ్ అయింది. 2019 నుంచి 2024 వరకు... వైసీపీ ప్రభుత్వం చేసిన భారీ తప్పిదాల వల్ల... జగన్మోహన్ రెడ్డి అధికారమే కోల్పోవడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యేలు గెలుచుకున్న వైసీపీ పార్టీ నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది.
వైసీపీలో ఉన్న కీలక నేతలు ఓడిపోవడం, కొంతమంది నేతలు వైసిపికి గుడ్ బై చెప్పడం లాంటివి జరిగాయి. అయితే వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి... పరిష్కరించుకోవాలి. మళ్లీ వాలంటీర్ వ్యవస్థ పైన ఊసు ఎత్తకూడదు. ముఖ్యంగా... వైసీపీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేర్చుకోవాలి. గత ఐదు సంవత్సరాల పాలనలో... చాలామంది వైసిపి నేతలు బండ బూతులు తిట్టారు.
చంద్రబాబును తిట్టడం కంటే పాలన పైన... జగన్మోహన్ రెడ్డి ఫోకస్.. పెడితే సరిపోయేది. కాబట్టి ఈ బూతుల నేతలను జగన్మోహన్ రెడ్డి సైడ్ చేయాలి. రోజా, కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ, లాంటి నేతల వల్ల వైసీపీ పార్టీ చాలా దెబ్బతిన్నది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలను.. గుర్తించి వారికోసం జగన్.. రంగంలోకి దిగాలి. వారికోసం గట్టిగా పోరాడాలి. అదే సమయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలి.