* టిడిపి కూటమిని ఢీకొడితేనే అది సాధ్యం
* ఎవరు గెలుస్తారనేది లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనమైన వైసీపీ పార్టీ మరోసారి పవర్ లోకి వస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జగన్‌కు కంచుకోట అయిన రాయలసీమ ప్రజలు ఈసారి అతన్ని పూర్తిగా రిజెక్ట్ చేశారు. సీబీఎన్‌కు కంచుకోట అయిన కృష్ణా జిల్లా ప్రజలతో పాటు అందరూ ఆయనకే ఓట్లు గుద్దారు. రాష్ట్రానికి సీఎంను నిర్ణయించడంలో గోదావరి జిల్లాలు ప్రతిసారీ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్క రాయలసీమతోనే గెలవడం సాధ్యం కాదని జగన్ సీఎం అయిన సమయం నుంచి టీడీపీ, పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. పవన్‌కు ఏదో ఒక రోజు గోదావరి జిల్లాలు కంచుకోటగా మారిపోతాయని జగన్ భయం. అదే జరిగింది కూడా.
ఇప్పుడు పవన్ 100% సక్సెస్ రేట్ సాధించి ఆ ప్రాంతానికి కీలకమైన నాయకుడు అయిపోయారు. పవన్ కళ్యాణ్ పట్ల ఏపీ ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. ఆయన, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి పోటీ చేస్తే మరోసారి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ, జేఎస్పీలు ఎక్కువ కాలం కలిసి ఉంటాయా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్ధకమే. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి లాగా రాజకీయాల నుంచి వెళ్లిపోవచ్చు. అనుకోని పరిస్థితుల కారణంగా CBN పదవీ విరమణ చేసినప్పుడు లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య ఆధిపత్య పోరు తలెత్తవచ్చు. టీడీపీ మద్దతు లేకుండా సీఎం కాలేరు పవన్ కళ్యాణ్. పీకే ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా కష్టమే అని కొందరు అంటున్నారు.
అలానే పీకే లేకుండా టీడీపీ గెలిచే అవకాశాలు కూడా తక్కువే నట. ఒకవేళ పవన్ లోకేష్ ఇద్దరు గొడవపడిన వేరువే పడితే జగన్ గెలిచే అవకాశాలు ఉంటాయి జగన్ ఇప్పటికే ఓకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తొక్కేయాలని చాలా తపన పడుతున్నారు ఆయన అధికారంలోకి వస్తే వీరిపై కేసులు వేసి జైల్లోకి తోస్తారు అనడంలో సందేహం లేదు.
అందుకే వీరిద్దరూ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని మరి కొంతమంది పేర్కొంటున్నారు. అదే జరిగితే జగన్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను ఎవరు ఊహించలేరు ఎప్పుడు కూడా అనూహ ఫలితాలతో ఏపీ ప్రజలు అందరికీ షాక్‌లిస్తుంటారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు కూడా పూర్తి కాలేదు. మూడు నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత టీడీపీ కూటమి పట్ల ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారో లేదో ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మాత్రమే ఎవరు గెలుస్తారనేది కచ్చితంగా అంచనా వేయగలం