నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది.దేశమంతా కూడా ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తోంది. జెమిలి ఎన్నికలకు ప్రణాళికను సైతం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని విషయం పైన ఇంకా సరైన స్పష్టత అయితే రాలేదు.. వీటికి  చాలా సమయం పడుతుందని పలువురు న్యాయనిపుణులు కూడా తెలియజేస్తున్నారు.


ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ సైతం ఒక నివేదికను ఇవ్వడంతో వీటిని ఆమోదించారు పార్లమెంటు శీతాకాలంలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించాల్సి ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. పార్లమెంట్ ఉభయ సభలలో బిల్లును ఆమోదించాలి అంటే అటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఆమోదించాలట. అయితే వీటికి చంద్రబాబు అంత సులువుగా ఒప్పుకోరని కూడా పలువురు నేతలు అంగీకరిస్తున్నారు.


2014లో అధికారంలో ఉన్నప్పుడు జమిలి ఎన్నికల ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చంద్రబాబునాయుడు వ్యతిరేకించారట. ఇప్పుడు కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా మధ్యంతర ఎన్నికలను తాను కోరుకోరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. 175 స్థానాలకు 164 స్థానాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. జమిలి ఎన్నికలకు అంగీకరించకపోవడానికి కూడా ఇదే కారణం అని కూడా పలువురు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పలేము కనుక చంద్రబాబు ప్రజల నాడిని అంచనా ఎవరు వేయలేమని  ఇచ్చిన హామీలు ప్రజలకు చాలానే ఉన్నాయి వీటిని అమలు చేయాలని లేకపోతే ప్రజలలో అసంతృప్తి ఉంటుందని అంచనా కూడా వేసి ఉంటారని అందుకే ఈసారి జెమిలి పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అంటే అది కుదరదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మాటలను మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: