- యువతకు పెద్దపీట వేయాల్సిందే.?
- కార్యకర్తలను కాపాడితేనే 2029అధికారం.
జగన్మోహన్ రెడ్డి 2019లో 150 సీట్లతో అద్భుతమైన మెజారిటీ సాధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయి ఎన్నో కీలకమైన పథకాలు తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఆయన తీసుకొచ్చిన పథకాలు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎవరు తీసుకురాలేదు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు అని చెప్పవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అనేక దందాలు నడిపించారు. అంతేకాదు వారు ఒక హోదాలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయి నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ప్రవర్తించారు. అలా జనాల్లో విపరీతంగా మైనస్ అయిపోయారు. కానీ జగన్ కు మాత్రం మన పార్టీ బలంగా ఉంది మనమే గెలుస్తామనే మెసేజ్ తీసుకెళ్లారని చెప్పవచ్చు. అదంతా నమ్మిన జగన్ కిందిస్థాయిలో చెక్ చేసుకోకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చి పార్టీ ఓటమికి తానే ప్రధాన కారకుడు అయ్యాడు. మరి అలాంటి జగన్ 2029లో పార్టీ నిలబడి కొట్లాడాలి ఏ పనులు చేయాలి ఎలా ముందుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం..
కార్యకర్తలను కాపాడాలి:
ప్రతి పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్పవచ్చు. జెండా మోసేది కార్యకర్త, దండా వేసేది కార్యకర్త, ప్రచారం చేసేది కార్యకర్త, చివరికి ఓట్లు వేసి గెలిపించేది కూడా కార్యకర్త. అలాంటి కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారు. కనీసం వారి అవసరాలు కూడా తీర్చకుండా పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో వాడుకొని వదిలేశారు. దీనికి తోడు ఎమ్మెల్యేలు మండల స్థాయి నాయకులు, మంత్రులు సొంత కార్యకర్తలని పట్టించుకోకపోవడం వల్ల జగన్ పాలనలో నిస్సహాయవులయ్యారు. ఇక దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ వల్ల కనీసం ప్రజలతో వారు మింగిల్ కాలేకపోయారు. దీంతో 2024 ఎలక్షన్స్ లో ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య విపరీతమైనటువంటి గ్యాప్ వచ్చింది. అయినా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా భావించారు.