చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చేలా ఉంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకునేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతోంది. గత ఐదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం జమిలి ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు ఈ  ఎన్నికలు నిర్వహించలేకపోయింది.


అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా అమలు చేయాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. మధ్యంతర ఎన్నికలకు మోదీ వెళ్తారని విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు. దీనికి ముఖ్యకారణం కేంద్రంలో మోదీకి బలం లేకపోవడం.. అదే సమయంలో 2026 వరకు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.


అయితే ఇలా వరుస పెట్టి ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర ఖర్చు అవుతుందని కేంద్రం భావిస్తోంది. అలాగే ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనం చేసేలా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు వెళ్లనుందట బీజేపీ. ఒకవేళ దేశ వ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు జరగితే ఏపీలోని కూటమి ప్రభుత్వం కూలడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పి సొంతంగా ఎన్నికలకు వెళ్లేందుకు సైతం బీజేపీ వ్యూహ రచన చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే మోదీ ప్రభావంతో చాలా వరకు రాష్ట్రాల్లో గట్టెక్క వచ్చని బీజేపీ అంచనా వేస్తుంది.


మరి ఈ నిర్ణయాన్ని చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు అంగీకరిస్తారో లేదో చూడాలి. కూటమి ప్రభుత్వం ఇటీవలే వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు ఫోకస్ పెట్టలేదు. కేవలం పాలనాపరమైన విధానాలనే చూస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ.. పాలనను గాడిన పెట్టేందుకు యత్నిస్తున్నామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు వస్తే హామీలు అమలు చేయలేదని జగన్ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరీ దీనిని చంద్రబాబు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: