తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీయలేదని, లేనిపోని ఆరోపణలతో చంద్రబాబు దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతకు, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి తీవ్ర నష్టం కలిగించారని రెడ్డి ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దురుద్దేశపూరితమైనవన్నారు. ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆరోపణలు చేయకూడదని పేర్కొన్నారు. 'తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసి చంద్రబాబు నాయుడు ఘోర పాపం చేశాడు. తిరుమల ప్రసాదం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్య అవాస్తవం. ఇలాంటి మాటలు మాట్లాడడం లేదా ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా చంద్రబాబు దిగజారగలడని మరోసారి రుజువు అయింది' అని టీటీడీ మాజీ చైర్మన్ తెలిపారు. “తిరుమల ప్రసాదం విషయంలో దేవుని సాక్షిగా నేను, నా కుటుంబం ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా?" అని సవాల్ విసిరారు. ఏదేమైనా ఈ అంశం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని చెప్పొచ్చు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రసాదం తయారీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.