ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైన నేపథ్యంలో ఇకపై చంద్రబాబు అడుగులు ఒకింత వేగంగానే ముందుకు పడనున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది. రేపు లేదా 21వ తేదీన నామినేటెడ్ పోస్టుల భరీ జరగనుందని తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారని భోగట్టా.
 
చంద్రబాబు, లోకేశ్ లను కలిసి ఇప్పటికే కొంతమంది నేతలు నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించారని కొందరు నేతలు తమకు పోస్ట్ ఇవ్వకపోయినా పరవాలేదు కానీ తాము చెప్పిన అభ్యర్థులకు మాత్రం అస్సలు ఇవ్వొద్దని చెప్పారని భోగట్టా. నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు న్యాయం చేయనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
 
నామినేటెడ్ పోస్టుల భర్తీ అనంతరం కూటమి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్న జాబితాలో నిజం లేదని టీడీపీ శ్రేణులు చెబుతుండటం గమనార్హం. మరి నిజంగానే ప్రాధాన్యత ఉన్న నేతలకు మాత్రమే పోస్టులు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది.
 
ప్రభుత్వ పెద్దలు జాబితా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఉత్కంఠ వీడటంతో పాటు ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా తెలివిగానే చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సొంత పార్టీ నేతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో తెలివిగా వ్యవహరిస్తూ పథకాల అమలు విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకుంటోంది. సరైన సమయం చూసి ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ టీడీపీ సర్కార్ ఏపీ  ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: