గడిచిన కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరీ జైత్వానీనీ వైసిపి నేతలు ఇబ్బందులకు గురి చేశారనే విధంగా వార్తలు వినిపించడమే కాకుండా వారి పైన కేసు పెడుతూ  కొంతమంది అధికారుల సమక్షంలో తనను బెదిరించారని కూడా చెప్పింది.ఈ కేసుని స్వయంగా కూటమి ప్రభుత్వమే సీరియస్గా తీసుకొని మరి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తనను ఇబ్బందులు పెట్టారని తెలిపింది.


అయితే ఇప్పుడు తాజాగా ఒక సడన్ ట్విస్ట్
కాదంబరీ జైత్వానీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదేమిటంటే గతంలో వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ఈమె పైన ఒక కేసు పెట్టారట. ఆ కేసును ఇప్పటికే కూడా వెనక్కి తీసుకోలేదని సమాచారం. ఇప్పుడు ఈ కేసు ఇందులో కీలకంగా మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజున లాయర్లతో కలిసి కాదంబరీ జైత్వానీ హోంమినిస్టర్ అనిత అని కలిశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరిన ఈమె.. అలాగే అప్పట్లో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తన మీద చేసిన ఫిర్యాదు కేసు ఇబ్రహీంపట్నంలో ఉన్నదని.. ఆ కేసన  వెనక్కి తీసుకోనేలా చేయాలంటూ కోరిందట.


అయితే ఈ విషయం పైన హోం మంత్రి హామీ ఇవ్వకుండా ఈ అంశాన్ని కేవలం సీఎం చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్తానని చెప్పినట్లు తెలిపిందట.. ఇలా హోంమంత్రితో భేటీ అయిన తర్వాత ఈమె లాయర్ నర్రా వెంకటేశ్వరరావు అసలు విషయాన్ని తెలియజేశారు.. కాదంబరీ పైన ఉన్న కేసు వెనక్కి తీసుకున్నట్లు అయితే ఇందుకు కారణమైనటువంటి ముంబై పారిశ్రామికవేత్త పై ఖచ్చితంగా తమ ఫిర్యాదు చేస్తామంటూ వెల్లడించారట. ఈ ముంబై పారిశ్రామికవేత్త వైసిపి అధినేత జగన్కు మంచి సన్నిహితుడట.. కానీ ఆ పారిశ్రామికను వదిలేసి కేవలం ఐపీఎస్లను మాత్రమే సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం..


ఒకవేళ ఇప్పుడు కాదంబరీ జైత్వానీ కోరినట్లుగా ఆమె పైన ఉన్న కేసుని వెనక్కి ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లు అయితే దీంతో ఆమెకు కచ్చితంగా క్లీన్ చీట్ ఇచ్చినట్లు అవుతుంది.. కానీ ఇప్పటికే ఇమే పై హనీ ట్రాప్ పాల్పడినట్లుగా పలు రకాల ఆరోపణలు కూడా నిజమవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఆమెకు క్లీన్ చీట్ ఇస్తే.. ముంబై పారిశ్రామికవేత్త పైన కేసుతో పోరాడుతామంటూ తెలుపుతున్నారు..మరి ఇలాంటి సమయంలో ఈమెకు క్లీన్ చీట్ ఇస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నది.వైసిపి నేతలపై ప్రతి కారం తీర్చుకోవాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఇది చేదు సంఘటన అని చెప్పవచ్చు.. కాదంబరీ కేస్ ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి సీఎంని ఇరగటం లో పెట్టేలా కనిపిస్తోంది కాదంబరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: