ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేవస్థానాలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకటి. ఏడుకొండలపై వెలసిన ఆ శ్రీవారిని దర్శించుకోవడానికి ఏటా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం ను దర్శించుకోవడానికి కేవలం మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు ప్రతి సంవత్సరం విచ్చేస్తూ ఉంటారు. ఇలా ఈ దేవస్థానానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నో సౌకర్యాలను ఏడుకొండల పై కల్పిస్తోంది.

ఇక కొన్ని సందర్భాలలో ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడుకొండల పై అనేక సౌకర్యాలు తగ్గాయి అనే వార్తలు కూడా వచ్చాయి. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దానితో మళ్ళీ ఏడుకొండల పై పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం అని మొదటి నుండి చంద్రబాబు ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇక చాలా మంది శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన కొండపైకి వెళుతూ ఉంటారు. ఇక కొంత కాలం క్రితం వరకు ఖాళీ నడకన వెళ్లే వారికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. కాలినడకన వెళ్లే వారికి స్పెషల్ గా టికెట్ ఇవ్వకపోవడంతో వారు మళ్ళీ క్యూ లో నిలబడే అవసరం వచ్చింది. కానీ మళ్ళీ టీటీడీ లో ఖాళీ నడక వారి కోసం పాత పద్ధతిని తీసుకువచ్చారు.

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లే శ్రీవారి భక్తులకు శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో 1200 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ల స్కానింగ్‌ ను పునఃప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టోకెన్ల స్కానింగ్‌ను పునఃప్రారంభించాలని ఐటీ విభాగానికి టీటీడీ ఈవో జె. శ్యామలరావు సూచించారు. దీని ద్వారా కాలినడక భక్తులకు ఎంతో ఊరట దక్కుతుంది. ఇకపోతే కాలినడక భక్తులకు ప్రధానంగా ఎదురయ్యే కష్టాలలో జంతువుల నుండి దాడి ఒకటి. దీనిద్వారా ఇప్పటికే అనేక మంది కి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. జంతువుల నుండి దాడిని నివారించడంలో ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేసినట్లు అయితే కాలినడక భక్తులు మరింత ఆనందపడే విషయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd