* వేల మంది భక్తుల ఆకలి తీర్చే శ్రీవారి ప్రసాదం నిత్యాన్నదానం..

* ఎన్టీఆర్ తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమానికి అప్పట్లో ఎన్నో ప్రశంసలు

* నాసిరక భోజనంతో క్షమించరాని తప్పు చేసిన వైసీపీ..?


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం ప్రపంచ వ్యాప్తముగా ఎంతో ప్రత్యేకత సంపాదించింది.. నిత్యం వేలాది మంది భక్తులతో శ్రీవారి ఏడుకొండలు ఎంతో సందడిగా కనిపిస్తాయి. కలి కాలంలో కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి ఆ శ్రీ మహా విష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఇక్కడ స్వయంగా వెలిశారని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు ‘కలియుగ వైకుంఠం’ అనే పేరు కూడా వచ్చింది.కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వున్న తిరుమల క్షేత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపు రేఖలు మారిపోతూ వచ్చాయి.. ఇక్కడ లభించే ప్రతీదీ ప్రత్యేకమే. అక్కడ లభించే వాటిని భక్తులు ఎంతో శ్రద్ధతో స్వీకరిస్తారు. తిరుమలలో స్వామివారి లడ్డు ప్రసాదం ఎంత ప్రత్యేకమో భక్తులందరికి నిత్య అన్నదానం కూడా అంతే ప్రత్యేకం. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్నదాన నిలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో నిత్యం అన్నదానం చేస్తూ.. భక్తుల ఆకలి తీరుస్తున్నారు.తిరుమలలో శ్రీవారి అన్నదాన నిలయాన్ని ఏప్రిల్ 6, 1985న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. దీనిని శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ అని పిలుస్తారు..


జూలై 7, 2011న అప్పటి భారత రాష్ట్ర పతి ప్రతిభాపాటిల్ గారు  శ్రీ తరిగొండ వెంగమాంబ అనే మరో నిత్య అన్నదాన కాంప్లెక్స్ ను ప్రారంభించారు.దీని నిర్మాణానికి సుమారు 35 కోట్ల రూపాయల ఖర్చయింది. ఈ అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణానికి దాతల నుంచి విరాళాలను స్వీకరించారు.ఈ భవనంలోని రెండు అంతస్తులలో నాలుగు పెద్ద భోజనశాలలు ఉన్నాయి. ఒక్కొక్క భోజనశాలలో ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినగలిగే సౌకర్యం ఉంది. ప్రతిరోజు 12 గంటల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కాంప్లెక్స్ లో సుమారు వెయ్యి మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతిరోజు 70 నుండి 80 వేల మంది భక్తులకు అన్నదానం సామర్థ్యం ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు శ్రీవారి నిత్య అన్నదానంలో భోజనం చేయాలనీ తపించిపోయేవారు..కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్య అన్నదానంలో భోజనం చేయాలంటే భక్తులు భయపడి పోయారు. దీనికి కారణం భక్తులకు పెట్టె భోజనం నాసిరకంగా ఉండడమే. నిత్యం లక్షల మంది శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో భక్తులకు అందించే ఉచిత భోజనం విషయంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహారించింది.భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి నిత్యాన్నదానంలో నాసిరకం భోజనం పెడుతుండటంతో భక్తులు భరించలేకపోయారు. గత ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు.. చేసిన పాపమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది అని భక్తులు చెప్పుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: