సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ను ప్రణీత పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవారి లడ్డు తయారిలో జంతు కొవ్వును వినియోగించడం దారుణం అని ఆమె పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు కలలో సైతం ఊహించనిదని ప్రణీత పేర్కొన్నారు. ఈ వివాదం గురించి మొదట స్పందించిన సెలబ్రిటీ ప్రణీత కావడం గమనార్హం.
ఇతర సెలబ్రిటీలు సైతం ఈ వివాదం గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. సమంత, జాన్వీ కపూర్, మరి కొందరు హీరోయిన్లు సైతం తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ హీరోయిన్లు సైతం ఈ వివాదం గురించి వేగంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూల గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం.
తిరుమల దేవస్థానం లడ్డూల తయారీలో పెద్దఎత్తున కల్తీ జరిగినట్టు ఒక సంస్థ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఆరోపణలు నిజమని ప్రూవ్ అయితే మాత్రం ఏం జరుగుతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన విషయాలు నెట్టింట ఒకింత దుమారం రేగుతున్నాయి. ఈ వివాదం అంతకంతకూ పెద్దదయ్యే ఛాన్స్ ఉంది.