తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... కీలక మార్పులు జరుగుతున్నాయి. అయితే కెసిఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు హైదరాబాదులో కంపెనీలు.. విపరీతంగా పెట్టుబడి పెట్టాయి. కానీ తెలంగాణలో ప్రభుత్వం మారడంతో.. హైదరాబాద్ ఆదాయం కూడా తగ్గినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. రియల్ ఎస్టేట్ తో పాటు కంపెనీల రాక కూడా పూర్తిగా తగ్గిపోయిందని అంటున్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు...  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుందని... చెబుతున్నారు.  అయితే ఇలా విమర్శలు వస్తున్నా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి భారీ డీలింగ్ జరిగినట్లు చెబుతున్నారు.  చంద్రబాబు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య 204 కోట్ల డీలింగ్ జరిగినట్లు సమాచారం.

 
అయితే వీరిద్దరి మధ్య రహస్యంగా జరిగింది కాదని సమాచారం. చంద్రబాబు నాయుడుకు హెరిటేజ్ కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు కుటుంబం పేరుపైన ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో 204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయిందట.హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించారట.


దీంతో నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ డీలింగుకు  ఒప్పుకున్నారట. దీంతో షామీర్పేటలో భారీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ నిర్ణయం తీసుకుందట. ఈ కంపెనీ కోసం భారీగా.. రాయితీలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవంగా కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీలకు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు కంపెనీ కావడం తో కాస్త వెనుకడుగు వేశారు కేసీఆర్. అప్పట్లో కేరళలో హెరిటేజ్ పైన బ్యాన్ విధించాలని సాకు చెందుతూ.. తెలంగాణకు రానివ్వలేదు కేసీఆర్.  కానీ ఇప్పుడు హెరిటేజ్ కంపెనీకి దారులు తెరుసుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: