ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ఓ చర్చ జరుగుతోంది. మొన్న 2024 లోని ఎన్నికలు జరిగి మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలు జరిగి తొమ్మిది నెలలు పూర్తికాగానే... జమిలి ఎన్నికల పేరుతో ఇప్పుడు తెరపైకి వచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర కేబినెట్లో దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది కూడా.. మోడీ సర్కార్.


ఈ బిల్లును పరిశీలించాలని రాష్ట్రపతి ద్రౌపది మురుముకు  కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇక ఈ బిల్లుకు రాష్ట్రపతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అనంతరం పార్లమెంట్లో పెట్టనున్నారు. చాలా సవరణలు చేస్తే గాని ఈ బిల్లు... తుది రూపం దాల్చుకోలేదు. వీగిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. ఈ సినిమా మొత్తం పార్లమెంట్ లోనే ఉంటుంది. అయితే.. అదృష్టం బాగుండి...  జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం  ఆమోదించ గలిగితే.. ఏక్షణమైన దేశవ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి.



2026 లోపు... దేశవ్యాప్తంగా మద్యంతర ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా మద్యంతర ఎన్నికలు జరిగితే వైసీపీకి లాభం చేకూరుతుందని జగన్మోహన్ రెడ్డి ఓ లెక్క వేసుకుంటున్నారట. జమిలి ఎన్నికలు జరిగితే...కూటమి నుంచి బిజెపి బయటకు వెళ్తుందని సమాచారం.మధ్యంతర ఎన్నికల్లో ఒంటరిగానే బిజెపి పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

అదే జరిగితే తెలుగుదేశం కూటమి చాలా వీక్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అలాగే మధ్యంతర ఎన్నికలు త్వరగానే వస్తున్న నేపథ్యంలో... చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు అమలు చేయాల్సిన పథకాలను ఏవి కూడా అమలు చేయలేడు. సరైన సమయం.. చంద్రబాబు దొరకదు.అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారట వైసీపీ నేతలు. ఇదే అంచనాకు జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరిగిందని సమాచారం అందుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: