- శ్రీవారి చుట్టే ఏపీ రాజకీయాలు..
- మహిమగల వెంకన్నతో  నాయకుల ఆటలు..
- అప్పుడు పింక్ డైమండ్ ఇప్పుడు లడ్డు..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరాధ్య దైవం  రాష్ట్రానికి తలమానికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతటి మహిమాన్వితమైనదో మనందరికీ తెలుసు. ఇక్కడి శ్రీవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైన నెరవేరుతాయనే నమ్మకం చాలా మంది భక్తులకు ఉంది. అలా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి  చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి.  తిరుమల దేవస్థానాన్ని చాలా వివాదాల్లోకి లాక్కు వచ్చి తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు   పింకు డైమండ్ వివాదం  రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపింది. ప్రస్తుతం ఎంతో ఫేమస్ అయినటువంటి తిరుమల లడ్డు గురించి  వివాదం చెలరేగుతోంది. రాజకీయాలకు అడ్డాగా తిరుమల శ్రీవారిని ఎంచుకోవడం  మంచిది కాదని భక్తులతో హిందూ వాదులు అంటున్నారు.
 
పింకు డైమండ్ వివాదం ఎలా వచ్చింది:
 టిడిపి ప్రభుత్వ హయాంలో  శ్రీవారి పింకు డైమండ్ చోరికి గురైందని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకులు  రమణా దీక్షితులు మీడియా ముఖంగా తెలియజేశారు. ఇక ఈ వివాదాన్ని వైసీపీ నేతలు రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. పింకు డైమండ్ చోరీ జరిగింది నిజమే అని ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోనే ఉందని అప్పటి వైసిపి నాయకులు అంతా ఆరోపించారు. అంతేకాదు జగన్ ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు ఇంటి వద్ద తవ్వకాలు జరిపిస్తే ఆ పింక్ డైమండ్ బయట పడుతుందని సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2019 ఎలక్షన్స్ కు ముందు   శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని రమణా దీక్షితులు చెప్పారు. ఈ విషయంపై జగన్ స్పందించి ఇది చంద్రబాబు ఇంట్లోనే ఉందని ఆయన ఇంటి వద్ద తవ్వకాలు జరిపితే డైమండ్ బయట పడుతుందని అన్నారు.


చంద్రబాబు తర్వాత 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఆ పింక్ డైమండ్ విషయాన్ని ఆయన బయటకు తీసుకురాలేదు. అలా రాజకీయాల కోసం పింక్ డైమండ్ వివాదాన్ని వాడుకున్నారు. అంతే కాదు జెనీవాలో పింకు డైమండ్ ను  వేలం వేశారని, అది ఇక్కడి పింక్ డైమండా కాదా అని ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ పింక్ డైమండ్ విషయంలో  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నానా హంగామా చేసినటువంటి జగన్, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయారు.. ఈ విధంగా పింక్ డైమండ్ పై రమణా దీక్షితులు చేసినటువంటి ఆరోపణలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. అప్పట్లో తిరుమల పింకు డైమండ్ ఎంత వివాదం సృష్టించిందో ప్రస్తుతం తిరుమల లడ్డు తయారీలో బీఫ్, చేప నూనె వంటి వాటితో పాటు నాసి రకం పదార్థాలు వాడి లడ్డుని తయారు చేస్తున్నారు అంటూ టిడిపి వాళ్లు చేసే విమర్శలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: