* తిరుపతిలో శ్రీవారి భక్తుల కష్టాలు.!
* టోకెన్ల సిస్టంతో ఇబ్బంది పడ్డ భక్తులు.!
* టీటీడి నిర్వాహకంపై భక్తుల ఆగ్రహం.!

(తిరుమల-ఇండియాహెరాల్డ్):ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాకు చెందిన తిరుమల వెంకటేశ్వరుని ఆలయం.ఈ ఆలయ నిర్వహణ చూసుకునే స్వతంత్ర సంస్థ టీటీడి 1993లో ఏర్పడి,దేవాలయం బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది.ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి దాదాపు రెండు వేల కోట్లరూపాయలు వార్షిక బడ్జెట్‌, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ చూసుకునే ఒక మహా వ్యవస్థగా మరింది.దింట్లో సుమారు పదనాల్గు వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ వీరందరు దేవస్థానం నిర్వహించే పన్నెండు ఆలయాలను ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునిక 'క్యూ' భవనాలునిర్మించారు.ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు,అనేక యాత్రికుల బస స్థలాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ఆలయానికి అందే విరాళాలు, సంపద పరంగాచూస్తే ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం.ఈ ఆలయాన్ని ప్రతిరోజూ యాభై వేల నుండి లక్ష మంది యాత్రికులు,సంవత్సరానికి సగటున ముప్పైయి నుండి నలభై మిలియన్ల మంది సందర్శిస్తుంటారు.వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో యాత్రికుల సంఖ్య దాదాపు అయిదు లక్షల వరకు ఉంటుంది.ఒకానొక టైంలో శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకు అష్ట కష్టాలు తప్పడం లేదు.భక్తులకు నాలుగు ఐదు రోజులకు దర్శనం టోకెన్లు ఇవ్వడంతో అటు ముందుకు, వెనక్కుమరియు అక్కడే ఉండలేక భక్తులు సతమతమవుతున్నారు.గతంలో టీటీడీ తెచ్చిన కొత్త నిబంధనలు ఇబ్బందిపాలు చేసేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు.

ఈ ఏడాది మొదట్లో టీటీడి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టం అనేది వాళ్ళ కాళ్లకు బంధనాలుగా మారాయి దాంతో తిరుతిలోనే భక్తులు పడిగాపులు కాయల్సి వచ్చేది. వచ్చిన లక్షలాదిమంది భక్తులకు తిరుపతిలో హోటల్ రూమ్స్ సరిపోకపోవడంతో ఒకవేళ సరిపోయినప్పటికీ వాటి ధరలు పెంచడంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు.దాంతో చిన్నారులతో,వృద్ధులతో ఆరుబయట బిక్కు బిక్కు మంటూ కుర్చోవాల్సి వచ్చేది.గతంలో మాదిరి ఒకటి రెండ్రోజులు కాకుండా  ఈ ఏడాది జనవరి నెలలో దాదాపు పది రోజులపాటు ఉత్తర ద్వారా దర్శనం కల్గించడంతో ఒక్క ఏపీ కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వెల్లువెత్తారు.అయితే అలా వచ్చిన వారందరికీ తిరుపతిలోనే బ్రేక్ పడి వారికీ టోకెన్లు కేటాయించడంతో వారి పరిస్థితి దారుణంగా తయారైంది. టోకెన్లు ఉంటేనే దర్శనానికి అనుమతి ఇవ్వడంతో వారికీ వచ్చిన టోకెన్లు దాదాపు నాలుగు రోజుల తర్వాత దర్శనానికి ఆలౌట్ అవ్వడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.టోకెన్లు ఇచ్చినప్పటికి కేవలం దర్శనానికి ఒక రోజు ముందు మాత్రమే కొండ పైకి పంపుతామంటూ అధికారులు చెప్పడంతో తిరుపతిలో అలాగే ఖాళీ ప్రదేశాల్లో బస చేయలేక ఆవేదన వ్యక్తం చేస్తా కొంతమంది భక్తులు వెనక్కి తిరిగి వెళ్లారు.ఈ కొత్త నిబంధనలు వారికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: