ఈ నేపథ్యంలోనే ఆరోపణలు చేసిన చంద్రబాబుకు తీవ్రమైన సవాలు విసిరారు ఈ రెడ్డిగారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని, రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడని దుయ్యబట్టారు. అంతేకాకుండా, బాబు నిజమని తేలితే... తిరుపతి వెళ్లకుండానే గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు. తిరుమల ప్రసాదంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆ దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం.. అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా లోకేశ్ లు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణానికి సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.
ఇక ఇదే అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటల్ని చంద్రబాబు మాట్లాడారని, హిందువుల మనోభావాల్ని చంద్రబాబు కించపరుస్తున్నారు అని దుమ్మెత్తిపోశారు. ఇక ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి, బాబు వ్యాఖ్యలను ఉద్దేశించి పాజిటివ్ గా ఇచ్చిన రిపోర్టుని ఉద్దేశిస్తూ... కరీముల్లాతో చంద్రబాబుకి మంచి స్నేహం ఉంది. తనకు కావాల్సినట్లుగా రిపోర్టు రాయించుకున్నారు అని తప్పుబట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘‘జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసిన వారంతా సర్వనాశనం అవుతారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారు!’’ అంటూ శపించడం జరిగింది.