ఆయన అనేక యుద్ధాలను ఆరితేరిన మూర్తి. ధీరులకు గెలుపోటములు, దూరాభారాల లెక్కలు అవసరం వుండదు. నిరంతర సాధనే కార్యసాధకుల లక్ష్యం. పట్టుదల, అంకితభావం, సమర్థత, దురదృష్టి ఈ లక్షణాలు వున్న నాయకుడు వాటిని సానుకూలశక్తిగా ఉపయోగించుకొన్నప్పుడు ఎదురైన ప్రతిఓటమి, ప్రతి అవమానం విజయపథంలో నడిపించే ఇందనాలు అవుతాయి.. అంతటి ఘనుడు చంద్రబాబు. రాజకీయం అంటే అధికారం కోసం కాదు, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందడం అంటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా డెభ్భై ఏళ్ల వయసులోనూ అలుపెరుగని యోధుడులా ముందుకు సాగుతున్న మహాపధికుడు..


చంద్రబాబు. 1956 నుండి రాష్ట్రరాజకీయ చరిత్రలో ఆయన సుధీర్ఘ అనుభవంతో పోల్చ గల  నాయకులు లేరు. పడి లేచే కడలి తరంగం లాంటి చంద్రబాబును ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా చూపేది ఆయనలోని వెన్ను చూపని ధీరత్వమే. ఆయన రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు.. స్వతంత్ర్య వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. అలాంటి చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లినాటి సంఘటనని గుర్తుతెచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ ఒక షరతు పెట్టాను అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం మద్రాస్‌లోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పెళ్లి సమయానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.


తమ పెళ్లి గురించి ముందుగా ఎన్టీఆర్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చిందన్నారు. పెద్దవాళ్లతో మాట్లాడి కబురు పంపుతామని చెప్పానని బాబు తెలిపారు. భువనేశ్వరిని పెళ్లాడాలని ఎన్టీఆర్ కోరారని.. మొదట్లో తాను కొంచెం బెట్టు చేశానని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు. పెళ్లి చూపులకు వెళ్లగానే పెద్ద పూలమాల తీసుకొచ్చి నా మెడలో వేశారని, దీంతో తాను ఇబ్బందిపడ్డానని బాబు తెలిపారు.


పెళ్లి చూపుల్లో భువనేశ్వరీ, నేను మాట్లాడుకున్నామని బాబు చెప్పారు. ‘‘నేను పల్లెటూర్లో పుట్టి పెరిగాను.. మంత్రి పదవి పోతే.. మళ్లీ పల్లెటూరుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని భువనేశ్వరికి చెప్పానన్నారు. దానికి భువనేశ్వరి, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి అని మా నాన్నగారు నాకు నేర్పారు అని చెప్పారు. ఆ మాటలకి చంద్రబాబు నాయుడు ప్రేమలో పడిపోయారట. ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధాన్ని కుదుర్చుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.


కానీ ఈ పెళ్లికి ఒక చిన్న షరతు పెట్టారట. నాకు కట్న కానుకలు ఏమి అవసరం లేదు కానీ ఈ పెళ్లిని చాలా ఘనంగా చేయండి అని అడిగారట. దానికి ఎన్టీఆర్ చిత్తూరులో ఉన్న ప్రతి గడపకి శుభలేఖలను పంపారట. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులని, ముఖ్యమంత్రులని, రాజకీయ నాయకులని పిలిపించి అనుకోని రీతిలో ఘనంగా పెళ్లి ఏర్పాటు చేశారట.


మనుషులను క్షుణ్నంగా అధ్యయనం చేయడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చంద్రబాబు చెప్పారు. ఆయన అభిమానులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని, వారితో ఏకాంతంగా మాట్లాడటం కోసం నన్ను కూడా ఎన్టీఆర్ బయటకు పంపేవారని తెలిపారు. మనుషుల్లో ఉండే పాజిటివ్ పాయింట్లను ఎన్టీఆర్ గారు గుర్తిస్తారన్నారు. ఎన్టీఆర్ గారీని పార్టీ పెట్టాలని తాను సూచించానని.. కానీ తనను ఆరంభంలోనే పార్టీలోకి తీసుకోవడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదని బాబు చెప్పారు. ఎన్టీఆర్ గెలిచిన తర్వాత రాజకీయాలు మానేసి వ్యాపారవేత్తగా మారదామని అనుకున్నానని బాబు తెలిపారు. కానీ ఆగష్టు సంక్షోభం తర్వాత రాజకీయాల వైపు చూడాల్సి వచ్చిందన్న

మరింత సమాచారం తెలుసుకోండి: