జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు హోరాహోరాగా తలపడుతున్నాయి. విజయంపై ఎవరి ధీమా వారికి ఉంది. ఈ సమయంలో పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అంతే కాదు జమ్మూ కశ్మీర్ లో ఎవరు గెలుస్తారో కూడా ఆయన జోస్యం చెప్పడం సంచలనంగా మారింది.
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించడానికి ఆదేశంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. భారత దేశంలోని కాంగ్రెస్-నేషనల్ కాన్పరెన్స్ కూటమి ఒకే వైఖరితో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధిస్తుంది. ఆ కూటమి ఆర్టికల్ 370, 35 ఏ పునరుద్ధరణకు తోడ్పడతాయి అని నమ్మకం మాకు ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ , మా వైఖరి ఒకే విధంగా ఉందని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ జియో న్యూట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిగా కలిసే పోటీ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని ఎన్సీపీ చెబుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం నిశబ్ధంగా ఉంది. అయితే ఈ హామీని కనీసం వాటి ఉమ్మడి మ్యానిఫెస్టోలో కూడా చేర్చలేదు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల ప్రజల భావోద్వేగాలు పెరిగాయని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి.
ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ గెలిస్తే కశ్మీర్ ను పాక్ కి అమ్మేస్తారేమో పాకిస్థాన్.. ఒక ఉగ్రవాద దేశం.. కశ్మీర్ పై వైఖరిలో కాంగ్రెస్, ఎన్సీపీలకు ఆ దేశం మద్దతు ఇస్తోంది. దీనిని బట్టి రాహుల్ గాంధీ భారత దేశ ప్రయోజనాల విషయంలో ఎలాం ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవ్య స్పష్టం చేశారు.