నిన్నటి రోజు నుంచి తిరుపతి లడ్డు వ్యవహారమే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వైసిపి పాలనలో తిరుపతి లడ్డులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును కలిపి లడ్డూని చేశారనే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు  వైసిపి ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.. చాలామంది ఈ విషయం పైన  అటు ఇరువురు  రాజకీయ నేతలు కూడా విమర్శలు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఏపీ సీఎంకు దిమ్మతిరిగేలా సమాధానాన్ని ఇచ్చారు.


తాజాగ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు దేవుడిని కూడా రాజకీయాలలోకి లాగేలా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఎక్కడ ఉండరు.. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పైన ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. అందుకే తిరుమల దేవస్థానంలోని పవిత్రమైన లడ్డు పేరుతో వీటన్నిటిని డైవర్షన్ చేసే విధంగా పలు రకాల రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. కల్తి నెయ్యి అనేది కేవలం ఒక కట్టు కథ ఒక పిట్ట కథ అంటూ తెలిపారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎలాంటి వాటికైనా దిగజారుతారని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్.


అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సప్లై కార్యక్రమానికి సంబంధించి టెండర్లు పిలుస్తూ ఉంటారని అందులో ఎవరు వస్తే వాళ్లకు బోర్డు కూడా అప్రూవల్ చేస్తుందంటూ తెలియజేశారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలను సైతం దెబ్బతీసేలా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారని పలువురు వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు.. ఈ విషయం పైన వైసిపి నేతలు కూడా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మరి ఈ లడ్డు రాజకీయం ఇప్పుడు ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: