సామాజిక పెన్షన్ల అర్హత నిర్థారణ అంశంపై త్వరలోనే కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం ఏర్పాటవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. కొందరు అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని అన్నారు.గురువారంఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ... బైక్‌లు నడుపుతున్న కొంతమంది రూ.15 వేల వికలాంగ పెన్షన్‌ తీసుకుంటున్నారని చెప్పారు. డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటిచ్చారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.ఇదిలావుండగా జగన్ ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంక్‌ను అప్పుల్లో ముంచిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.950 కోట్ల స్త్రీనిధిని పీడీ ఖాతాలకు మళ్లించిందని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన గురువారం సచివాలయంలో సెర్ఫు పై తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూడటం, సెర్ఫు పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తి వంతంగా సెర్పు పనిచేసేలా దిశ నిర్థేశాన్ని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.

సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వివరించారు. అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఇలాంటి వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు.పెన్షన్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు త్వరలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్లకే పింఛను మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చజరిగిందని, రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మద్య ఉన్న వారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు ఒక అంచనాకు రావడం జరిగిందని, అయితే వారికి పింఛను అందజేసే విదానంపై త్వరలో జరుగబోయే సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు.ఇదిలావుండగా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా రూ.42 కోట్ల విడుదల తద్వారా రూ.512 కోట్లు అందుబాటులోకి వస్తాయి. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: