తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో గత రెండు రోజుల నుంచి ఒక పెద్ద రగడే నడుస్తున్నది.. వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డులు తయారు చేసే వాటిలో జంతువుల కొవ్వుతో తయారు చేశారని సీఎం చంద్రబాబు రెండు రోజులు క్రితం తోట ఆరోపణలు చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల టీటీడీ పవిత్ర త దెబ్బతింటుందంటూ కూడా చాలానే ఆరోపణలు చేయడం జరిగింది. ఇవే కాకుండా భక్తుల అన్న ప్రసాదాల్లో విషయంలో కూడా కల్తీ జరిగిందని వ్యాఖ్యలు చేయడంతో అప్పటినుంచి ఒక వివాదం నడుస్తూ ఉన్నది.


వీటి పైన టీటీడీ మాజీ చైర్మన్ కూడా స్పందిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి తాను ప్రమాణం చేయడానికి సిద్ధమేనని సీఎం చంద్రబాబు అందుకు సిద్ధమేనా అంటూ ఆయన ఈ వాక్యాలను ఖండించారు. అయితే ఇవన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చిన అంశాలే అంటూ టిడిపి నేతలు మాత్రం మళ్లీ మాట మారుస్తున్నారు. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో పాటుగా కొన్ని అభ్యంతరకరమైన పదార్థాలు ఉన్నాయనే విధంగా ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చాయని కూటమి ప్రభుత్వం తెలుపుతోంది. వైసీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ అని వాటిని వైసిపి ప్రభుత్వం చేసింది అన్నట్లుగా కుట్ర చేస్తున్నారు అన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.



ఈ విషయం పైన హిందూ ధర్మం ప్రచారకుడు రాధ మనోహర్ కూడా లడ్డు నాణ్యతను ప్రశ్నించడం జరిగింది. కానీ ల్యాబ్ రిపోర్ట్ లో మాత్రం లడ్డు తయారీ వినియోగిస్తున్న నెయ్యి నాణ్యమైనదా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గుజరాత్ లోని ఎన్డిడీపీకి చెందిన ల్యాబ్ కి పంపించారట. జులై 8వ తేదీన పంపగా వాటర్ రిపోర్ట్ అదే నెల 16వ తేదీ వచ్చిందట. తమిళనాడు ప్రాంతానికి చెందిన కంపెనీ ఈ నెయ్యిని అందిస్తూ ఉండేది. కల్కి నెయ్యి అని విషయాన్ని తెలుసుకోవడంతో సరఫరాను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత KMF టీటీడీకి నీ సరఫరాను కొనసాగించింది. కానీ 2023లో వీటిని నిలిపివేయడం జరిగింది. నెయ్యి నాణ్యత విషయంలో లోపం గుర్తించిన అధికారులు నిలిపివేశారట. అయితే ల్యాబ్ పరిశీలనకు పంపిన తేదీన ఇప్పుడు రిపోర్ట్లు వచ్చిన తేదీలను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం కావాలని వైసిపి ప్రభుత్వం పైన ఇలా తప్పుడు ప్రచారం చేస్తోందని.. తప్పు జరిగి ఉంటే అది కూటమి ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది అంటూ పలువురు నేతలు వీడియోలతో సహా ప్రూఫ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: