* టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ చాలా కామన్
* ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు వేధింపులు
* హీరోల కంటే  ప్రొడ్యూసర్లు, దర్శకులే కారణంగానే కాస్టింగ్ కౌచ్


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ అనగానే... సినిమాలు, ప్రొడ్యూసర్లు, హీరోలు అలాగే హీరోయిన్లు  ఇలా చాలా అంశాలు వస్తాయి. వీటితోపాటు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరిగిపోయింది. నెలకొక కేసు తెరపైకి టాలీవుడ్ ఇండస్ట్రీలో రావడం జరుగుతుంది. సంఘటనల పేరు చెప్పడం కంటే... కాస్టింగ్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు.

 
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి నుంచి... లేటెస్ట్ హీరోయిన్ శ్రీ లీల వరకు... చాలామందికి ఈ కాస్టింగ్ కౌచ్  ను ఎదుర్కొన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి చేసిన రచ్చ... ఇంకా ఎవరూ మర్చిపోలేదు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరిగిపోయిందని.. తనను కూడా వాడుకొని వదిలేసారని శ్రీ రెడ్డి అర్ధ నగ్నంగా.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫీసు ముందు రచ్చ చేసింది.

 
శ్రీ రెడ్డి చేసిన రచ్చ తర్వాత...  గాయత్రి లాంటి నటీమణులు కూడా తెరపైకి వచ్చారు. వీరితోపాటు..  పెద్ద పెద్ద టాలీవుడ్ హీరోయిన్లు అలాగే తమిళ హీరోయిన్లు కూడా... ఈ అంశంపై స్పందించారు. కెరీర్ ప్రారంభంలో ప్రతి ఒక్కరు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని... హీరోయిన్లు ఏ చెబుతున్నారు.  అయితే ఈ కాస్టింగ్ కౌచ్ పై చాలా వార్తలు వచ్చినప్పటికీ... ఇండస్ట్రీ కి సంబంధించిన పెద్దలు ఎక్కడ స్పందించడం లేదు.


బాధితులకు అండగా ఉండాల్సింది పోయి... దుర్మార్గులకు కొంతమంది టాలీవుడ్ పెద్దలు.. అండగా నిలుస్తున్నారని కూడా వార్తలు... రావడం జరుగుతుంది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు అలాగే దర్శకులు.. కూడా నిందితులుగా ఉంటున్నారని సమాచారం. అందుకే ఈ అంశంపై టాలీవుడ్ పెద్దలు ఎక్కడ స్పందించడం లేదని కూడా ఒక వాదన ఉంది. ఏదేమైనా ఇలాంటి అంశాన్ని.. భూస్థాపితం చేయాలంటే కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక సంచలన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: