కొన్ని వారాల క్రితం తిరుపతి ఈస్ట్ కోస్ట్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సైతం తెగ వైరల్ అయింది. బాధితురాలు ఆరోపణలు చేసిన తర్వాత తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలను సైతం నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ పార్టీకి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడింది.
కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా టీడీపీ తమ పార్టీపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది. అయితే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి రాజీ చేశారని సమాచారం అందుతోంది. బాధితురాలు వెనక్కు తగ్గడానికి డబ్బే కారణమా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నారని భోగట్టా.
కోనేటి ఆదిమూలం ఈ వివాదం నుంచి బయటపడటంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఈ తరహా వివాదాలు పేరు, ప్రతిష్టలను మసకబారుస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తేస్తే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.