ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన చాలా కీలకమైన అంశాలను వ్యవస్థలను సైతం కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా జగన్ హయాంలో వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి సచివాలయ వ్యవస్థను కూడా తీసుకురావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పని చేసుకునేవారు. అయితే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను సైతం ప్రభుత్వంలోకి కలిపేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాలంటరీలకు ఒక గుడ్ న్యూస్ తో పాటు బ్యాడ్ న్యూస్ ను కూడా అందించింది.


గత వైసిపి ప్రభుత్వంలో ప్రతి 2,000 ఇళ్ల పరిధిలో ఒక గ్రామ , వార్డు సచివాలయ భవనాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు కూడా పనిచేస్తూ ఉండేవారు. అయితే వీటివల్ల ప్రజలకు లబ్ధి  పొందే అవకాశం లేదని కూటమి ప్రభుత్వం సచివాలయాలను ప్రభుత్వ శాఖలకు అటాచ్మెంట్ చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఏపీ సీఎం నేతృత్వంలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు రకాల నిర్ణయాలు తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


ఎన్నికల సమయంలో వాలంటరీలను పక్కన పెట్టించేల నిర్ణయాలు తీసుకున్నారు.. వాలంటరీ 2.3 లక్షల మంది ఉన్నప్పటికీ కానీ ఇందులో కొంతమంది నేతల ఒత్తిడిల వల్ల 1.7 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు మిగిలిన వారిలా చాలామంది వేరే ఉపాధిని చూసుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోను ప్రస్తుతం ఉన్న వాలంటీలను ప్రభుత్వ శాఖలకు సైతం అటాచ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే వీరికి నైపుణ్యంతో సహా ఇతర వాటిలో ప్రావీణ్యం ఇచ్చేలా అలాగే విద్యా అర్హతలను బట్టి ఆయా శాఖలలో వారికి అవకాశం కల్పించేలా చూస్తున్నారట. వీరికి ఇచ్చిన హామీ మేరకే 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వబోతున్నారట. అయితే రాజీనామా చేసిన వారిని తీసుకోబోమంటూ ఇప్పటికే పలువురు మంత్రులు తెలియజేశారు. అలాగే విద్యార్హత కూడా పెంచేలా ప్రతిపాదన తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: