ఇందులో భాగంగానే దాదాపు 155 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు కల్వకుంట్ల కవిత. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తోపాటే కల్వకుంట్ల కవిత... తిహార్ జైల్లో చిప్పకూడు తిన్నారు. అయితే ఇటీవలే.. చాలా కష్టపడి ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు కల్వకుంట్ల కవిత. గత నెలలో కల్వకుంట్ల కవిత జైలు నుంచి రిలీజ్ అయి ఇప్పుడు... అరెస్టు తీసుకుంటున్నారు.
ఎక్కడ కూడా రాజకీయ సమావేశంలో కనిపించడం లేదు కల్వకుంట్ల కవిత. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కేవలం... గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావును మాత్రమే కలిసింది కల్వకుంట్ల కవిత.ఆ తర్వాత ఎక్కడ కవిత కనిపించలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల కవిత అసలు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు కేజ్రీవాల్ కూడా. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనానికి దారి తీశారు.
అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే కల్వకుంట్ల కవిత కూడా... కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. లిక్కర్ స్కాం ఉన్న తరుణంలో... రాజకీయాలకు అలాగే గులాబీ పార్టీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. కేవలం వ్యాపారాలకే పరిమితం కావాలని అనుకుంటున్నారట కవిత. ఈ లిక్కర్ స్కాం ఉన్న తరుణంలో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే... మళ్లీ ఎదురుదెబ్బలు తగిలి చాన్స్ ఉందని ఆమె అభిప్రాయపడుతున్నారట. అందుకే.. రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారట కవిత. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.