ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం పైన వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి ప్రసాదంలో... జంతువుల కొవ్వు అలాగే నూనె వాడుతున్నారని సంచలన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వయంగా చెప్పడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో... అందరూ ఇది నిజమే అని నమ్ముతున్నారు.

 


ఈ లడ్డుల కల్తీ అనేది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని... చంద్రబాబు నాయుడు నొప్పి చెప్పారు. తక్కువ ధరకు నెయ్యి తీసుకువచ్చి... ఇలా ప్రసాదాన్ని కల్తీ చేశారని చంద్రబాబు నాయుడు మండిపడడం జరిగింది. అయితే దీనిపై వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. లడ్డు ప్రసాదంలో ఎలాంటి  కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

 

చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన పై ప్రజలు నిలదీస్తారని టాపిక్ డైవర్ట్ చేశాడని జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. జూలై మాసంలో రిపోర్ట్ వస్తే ఈ సెప్టెంబర్ మాసంలో చంద్రబాబు నాయుడు ఎందుకు రిలీజ్ చేశాడని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జూలై మాసంలోనే ఈ రిపోర్టర్. రిలీజ్ చేస్తే అసలు విషయం బయటపడేదని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీంతో కొంతమంది వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడుతుంటే... మరికొంతమంది చంద్రబాబు నాయుడును మెచ్చుకుంటున్నారు.

 

అయితే ఈ వివాదం లో బిజెపి ఇప్పటికే ఎంట్రీ అయి రచ్చ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే బిజెపి తెలంగాణ నేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతా కూడా స్పందించడం జరిగింది. హిందూ దేవాలయంలో గత పాలకులు దౌర్జన్యంగా వ్యవహరించాలని ఆమె మండిపడ్డారు. తిరుపతి లడ్డూలను అయోధ్యకు పంపించడం కారణంగా అక్కడ ఈ విషయం తేలిందని మాధవి లతా చెప్పడం జరిగింది. లేకపోతే ఈ విషయం అసలు బయటపడేదే కాదని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: