ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి.. వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆ పార్టీ నేతలు ఎవరు నమ్మటం లేదు. వరుస పెట్టి పలువురు కీలక నేతలు వైసీపీని వీడి.. బయటకు వచ్చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినవారు మంత్రులుగా పనిచేసిన.. వారు చివరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారు సైతం వైసీపీని వీడి బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఆళ్ళ నాని, కిలారు వెంకట రోశ‌య్య, సామినేని ఉదయభాను, మద్దాలి గిరిధర్ రావు ఇలాంటి వారు బయటకు వచ్చేశారు.
 

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు.. ఎన్నికలకు ముందు ఏలూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చి.. ఆర్థికంగా ఖర్చులు భరించి గెలిచాక.. మంత్రి పదవితో పాటు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఏలూరు జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చినా కూడా.. ఆళ్ళ నాని లాంటి నమ్మకమైన వ్యక్తి కూడా ఎన్నికల తర్వాత బయటకు వచ్చేసారు. ఇక జగ్గయ్యపేట లాంటి నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీని నమ్ముకుని రాజకీయం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేనలోకి వెళ్లిపోతున్నారు. జగన్‌కు సొంత మామ అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జనసేన బాటలో ఉన్నారు.


ఇక ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రిగా ఉన్న పార్టీ సీనియర్ నేత ఆచంట , మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజుతో పాటు.. జగన్ కోసం చాలా త్యాగాలు చేసిన గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా 2019 ఎన్నికలలో భీమవరంలో.. పవన్ కళ్యాణ్‌పై గెలిస్తే గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇస్తానని .. జగన్ హామీ ఇచ్చి ఆ మాట నెరవేర్చలేదు. ఇప్పుడు గ్రంధితో పాటు చెరుకువాడ ఇద్దరు జనసేనలోకు వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp