ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒకే టాక్ నడుస్తోంది... అదే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కహాని. సెప్టెంబర్ 27న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కి సిద్ధం అయింది. కొరటాల శివ దర్శకత్వంలో... జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్ధపడిన ఈ సినిమా గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా వైరల్ కాబోతున్న విషయాన్ని చూసి నందమూరి అభిమానులతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. అదేగాని జరిగితే దేవరాజ్ సినిమాకు ఆ ఒక్క ప్రమోషన్ చాలు... దుమ్మి దులిపేస్తోంది అని ధీమాగా అంటున్నారు.

విషయం ఏమిటంటే? సినిమా రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో సినిమా ప్రమోషన్స్ ఇండియా వైడ్ కూడా కాస్త గట్టిగానే చేస్తున్నారు. కాగా సెప్టెంబర్ 22న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాకు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి కూడా రాబోతున్నారని వినికిడి. అదే పెద్ద విషయం అనుకుంటే... ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్న వేళ, జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా స్టేజి పైన దేవర సినిమాలోని ఒక పాటకి డ్యాన్స్ పెర్ఫార్మ్ చేస్తాడని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ విషయం విన్ననాటి నుండి ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు షురూ చేశారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పవర్ ఫుల్ విలన్ రోల్ సైఫ్ అలీ ఖాన్ చేసిన విషయం కూడా తెలిసినదే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రసార చిత్రాలు, టీజర్, కలర్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: