తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయిందనే సంగతి తెలిసిందే. నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే నెయ్యి విషయంలో భవిష్యత్తులో సైతం ఈ తరహా వివాదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
నెయ్యిని పరీక్షలకు పంపించినా ఆ పరీక్షలో కచ్చితమైన ఫలితాలు వస్తాయని చెప్పలేం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాలలో గోశాలలను ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి అయిన పాలతో నెయ్యి తయారు చేసేలా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆ బాధ్యతలను ఆలయ నిర్వాహకులకు అప్పగించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తాయి. ప్రముఖ కంపెనీలు అని చెప్పి ఇతర కంపెనీలకు ఆ బాధ్యతలను అప్పగించినా ఎక్కడో ఒకచోట తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువ. ఎక్కువ సంఖ్యలో కంపెనీలు లాభాపేక్ష లక్ష్యంగా పని చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి కంపెనీలో అయినా ఒక ఉద్యోగి తప్పు చేస్తే ఆ ప్రభావం ప్రసాదంపై పడే అవకాశాలు ఉంటాయి.
 
నెయ్యిని తయారు చేసే చోట శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రశ్నలకు సైతం సరైన సమాధానాలు లేవనే సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే మాత్రం భక్తులు ప్రసాదం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు లడ్డూ కల్తీ ఆరోపణలలో వాస్తవాలు తెలియల్సి ఉంది. ఈ ఆరోపణల వల్ల ఏపీలో ఏదో ఒక రాజకీయ పార్టీకి మాత్రం ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుణ్యక్షేత్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: