* ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి విషయంలో రాజుకున్న వివాదం

* సాంప్రదాయం పాటించని గత వైసీపీ ప్రభుత్వం

* స్థానికులను కాదని స్థానికేతరులకు చైర్మన్ పదవి



ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తి ల తరువాత అంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాణిపాకం..ఆలయ సంప్రదాయం ప్రకారం కాణిపాకం ఆలయ చైర్మన్ పదవి స్థానిక ఉభయదారులకే కట్టబెడుతూ వస్తున్నారు..రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఆలయ చైర్మన్ పదవి మాత్రం ఉభయదారులకే దక్కేది..కాణిపాకం ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి.. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తర తరాలుగా వస్తున్న సంప్రదాయానికి మంగళం పాడింది.. స్థానికులు అయిన ఉభయదారులకు కాకుండా స్థానికేతరులకు చైర్మన్ పదవిని అప్పగించింది.పూతల పట్టు నియోజకవర్గం నుంచి కాకుండా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పెనుమురు మండలానికి చెందిన ప్రమీల రెడ్డి అనే మహిళకు ఆలయ చైర్మన్ పదవిని కట్టబెట్టింది..


చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డికు వదిన కావటంతో ఆమెకు ఈ పదవిని అప్పగించారు..కాణిపాకం ఆలయ చైర్మన్ పదవిపై స్థానిక ఉభయదారులు, వైసీపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..కానీ వారి ఊహకి అందని విధంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవులలో ప్రమీల రెడ్డికి కాణిపాకం ఆలయ చైర్మన్ పదవిని ఇచ్చారు..ప్రమీల రెడ్డి గతంలో పెనుమురు మండలంలో మాజీ ఎంపిపిగా పని చేసారు..దీనితో ఆమెను చైర్మన్ గా నియమించడంతో స్థానిక ఉభయదారులు, వైసీపీ నేతలు మండిపడ్డారు.చాలా కాలంగా పార్టీలో వుంటూ కష్టపడి పని చేసిన తమకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు..స్థానికులకు కాకుండా స్థానికేతరులకు చైర్మన్ పదవి ఎలా అప్పగిస్తారని వారు తీవ్రంగా మండిపడ్డారు.చైర్మన్ పదవిని ఇస్తే ఉభయదారులకు లేదంటే స్థానిక నేతలకు ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసారు..వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ఉభయ దారులు కోర్టుని ఆశ్రయిస్తామని బెదిరించారు.. ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి సాంప్రదాయం మారవొద్దని ఉభయదారులు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: