సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంతో పాటు ప్రజల కష్టాలు తీర్చేందుకు తమ వంతు కృషి చేయాలి. అయితే మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైతం చెడ్డ పేరు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొంతమంది రాజకీయ నేతలు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో తమ సిఫార్సులతో దర్శనాలు కల్పిస్తున్నారు.
 
కొంతమంది తాము దర్శనానికి వెళ్తే తమతో పాటు 20, 30 మందిని వెంట తీసుకెళ్తున్నారు. మరి కొందరు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కాంట్రాక్ట్ లను తమకు సంబంధించిన వాళ్లకు మాత్రమే ఇవ్వాలనే నిబంధనలను సైతం అమలు చేస్తున్నారు. కమీషన్ల కోసం కకృత్తి పడి కొందరు నేతలు తమ పరువు పోగొట్టుకోవడంతో పాటు పార్టీ పరువును సైతం తీసేస్తున్నారనే చెప్పాలి.
 
రాజకీయ నేతలు పరిధి దాటి వ్యవహరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సైతం రాజకీయ పార్టీలపై ఉంది. లడ్డూ రేట్లు పెరుగుతున్నా లడ్డూల క్వాలిటీ మాత్రం పెరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లడ్డూల పరిమాణం సైతం తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లడ్డూలలో నిజంగా కల్తీ జరిగిందో లేదో మాకు అర్థం కావడం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
 
తిరుమల స్వామికి బెస్ట్ క్వాలిటీ నెయ్యి మాత్రమే కొనాలని క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడవద్దని భక్తులు కోరుతుండటం గమనార్హం. పూజారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా తప్పు చేసిన వాళ్లను శ్రీ వేంకటేశ్వర స్వామి కఠినంగా శిక్షించడం ఖాయమని పూజారులు సైతం చెబుతున్నారు. పుణ్యక్షేత్రాలలో రాజకీయ నేతలకు ఎలాంటి అదనపు సౌకర్యాలు లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. తిరుమల లడ్డూ వివాదం రాజకీయ వివాదం అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఒపీనియన్ పోల్స్ లో సైతం ఇదే కామెంట్ వినిపిస్తుండటం గమనార్హం. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాలు ఒకింత ఎక్కువయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: