మన భారతదేశం అటు ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది. ఎన్నో మతాల సమ్మేళనం కూడా. ఎవరికి వారు వారి మతాన్ని అనుసరిస్తూ ఇతర మతాలను గౌరవిస్తూ ఇక హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్లుగానే ఉంటారు. అయితే ఇక ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్ అయినా మన దేశంలో ఎన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఆలయాలలో కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఒకటి. ప్రతి ఏడాది భక్తులు  అయ్యప్ప దీక్షను పూనీ మాల ధారణతో 41 రోజులపాటు నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు.


 ఇక అయ్యప్ప స్వామిని కొలుచుకోవడం వల్ల అన్ని కష్టాలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రముఖ ఆలయమైన అయ్యప్ప స్వామి క్షేత్రం ఎంతటి పెద్ద వివాదంలో చిక్కుకుందో ప్రత్యక్ష చెప్పాల్సిన పనిలేదు. అయ్యప్పను చిరబ్రహ్మచారిగా పేర్కొంటారు. అందుకే ఋతుక్రమం సాగే మహిళలు గుడిలోకి అడుగుపెట్టకూడదు అని ఆచారం ఉంది. ఇక ఇదే విషయాన్ని హిందూ వర్గాలు అన్ని ఫాలో అవుతూ వచ్చాయి. పది నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ఏ మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించకూడదు అనే రూల్ ఉంది.


 అయితే ఇది మహిళలపై వివక్ష చూపించడమే అంటూ ఇక ఎంతోమంది మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ఇక ఇదే విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అయితే ఇక లింగ బేధం లేకుండా అందరూ అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఎంతో మంది మహిళలు అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన.. హిందూ వర్గాలు మాత్రం మహిళలను అడ్డుకున్నాయి. పోలీసులు బందోబస్తు మధ్య కూడా ఇది సాధ్యం కాలేదు. కానీ బిందు, కనకదుర్గ అనే మహిళలు ఏకంగా అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించడం సంచలనంగా మారిపోయింది. ఇక వీరి వయసు 40 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఇక శబరిమల ఆలయం లో అపచారం జరిగిందని.. ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని ప్రధాన పూజారి చెప్పారు. భక్తుల కళ్ళు గప్పి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దేవున్ని అపహాస్యం చేయడం.. మానవాళికి అసలు మంచిది కాదు అంటూ సూచించారు. అయితే ఈ వివాదం అప్పట్లో ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: