* ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీం..!
* ఆలయ నిర్వహణ జోలికి వెళ్లోద్దని వార్నింగ్.!
* ప్రభుత్వ తీరు మార్చుకొని ఆలయ అభివృద్ధికి సహకరించాలని సూచన.!

(కర్నూల్-ఇండియాహెరాల్డ్):  అహోబిలం,నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన పుణ్యక్షేత్రం.ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డకు,నంద్యాల దగ్గరిలో నెలకొన్న ఆలయం.ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల మఠ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కారణంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా పేరొందింది.అహోబిల మఠం అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవిభాజ్య కర్నూలుజిల్లా, ఆళ్లగడ్డ మండలం,అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది.

అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు.అలాంటి దేవాలయా నిర్వహణను అహోబిలమఠం చూసుకుంటుంది.

అయితే అహోబిలం మఠంపై కొన్నేళ్లుగా నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్ట్ తెరదించింది.ఆలయాలు, ధార్మిక క్షేత్రాలు ధర్మకర్తలకే విదిలేయాలన్న సుప్రీం ఆదేశాలతో ఆలయం నిర్వహణ మఠం పరిధిలోకి రానుంది.అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్వహణను అహోబిలం మఠం మరియు దేవాదాయ శాఖ సంయుక్తంగా చేపడుతున్నాయిఆలయంలో సిబ్బందికి విధులు మరియు భక్తులకు సౌకర్యాలు కల్పించటం, హుండీ ఆదాయలు,వేలంపాటలనిర్వహణ వంటివి పరిపాలన వ్యవహారాలు ప్రభుత్వం నియమించిన ఈడి చూసుకుంటుంది. సిబ్బందిని నియమించడం,తొలగించడం, వేతనాలు పెంచడం వంటివి మఠం పెద్దల చేతుల్లో ఉన్నాయి.అయితే సిబ్బంది నియామకాలు,వేతనాలు వంటి వాటిల్లో రాజకీయనాయకుల జోక్యం ఎక్కువైందని వాళ్ళ కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

గత సంవత్సరం సిబ్బంది వేతన విషయంలో, విధులు కేటాయించడంలోనూ కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని, వాహన పూజల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.ఈలాంటి విషయాల్లో మఠం నిర్వాహకులు,ఈఓల మధ్య తరచూ వివాదాలు జరిగేవి.ఈ నేపథ్యంలో అహోబిలం ఆలయం తమకే చెందుతుందని గత ఏడాది అటు మఠం,ఇటు దేవాలయ శాఖ హైకోర్టును ఆశ్రయించాయి.మఠానీకె అనుకూలంగా హై కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించింది.సుప్రీం సైతం మఠం సాధారణ కార్యకలాపాల్లో ప్రభుత్వానికి సంబంధం లేదని మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలని చూస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆలయాలను,ధార్మిక క్షేత్రాలను థర్మకర్తలకే వదిలేయాలని సుప్రీం తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: