ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024 అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలలో... చంద్రబాబు కూటమి విజయం సాధించడం ఒక ఎత్తు అయితే.. ఆరా మస్తాన్ సర్వే సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్ మరొక ఎత్తు అయింది. ఏపీ ఎన్నికల ఫలితాలు రాకముందే... ఒకరోజు ముందుగా రచ్చ చేసింది ప్రముఖ ఎన్నికల సర్వే ఆరా. ఆరా సంస్థ అధినేత ఆరా మస్తాన్... ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని తెలిపారు.


తనకు ఎన్నో రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉందని... అదే అనుభవంతో ఏపీ ఎన్నికలను అంచనా వేస్తున్నానని తెలిపారు. ఆరా మస్తాన్ చెప్పిన ప్రకారం... జగన్మోహన్ రెడ్డికి వందకు పైగా సీట్లు వస్తాయని తెలిపారు. కూటమి 60 నుంచి 70 మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉందని కూడా వివరించారు.  అయితే ఫలితాలు వచ్చేసరికి... పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కూటమి అధికారంలోకి రావడం... జగన్కు 11 సీట్లు.. రావడంతో ఆరా మస్తాన్ ను ఆడుకున్నారు టిడిపి నేతలు.

 

దొరికితే చావకొట్టేలా... కనిపించారు. కూటమి ప్రభుత్వం  వంద రోజులు పాలించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆరా మస్తాన్ యాక్టివ్ అయ్యారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు.. రాబోతున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో... తెరపైకి వచ్చారు ఆరా సర్వే సంస్థ అధినేత మస్తాన్. అయితే తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం కు వ్యతిరేకంగా.. అడుగులు వేస్తున్నారు మస్తాన్. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు... ముగిసిన కూడా కొన్ని లెక్కలు బయట పెట్టలేదని ఆయన ఈ లేఖలో వివరించారు.  పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20 ని అధికారిక వెబ్సైట్లో ఎందుకు పొందుపరచలేదని నిలదీశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 48 గంటల్లోనే ఈ ఫామ్... అధికారిక వెబ్సైట్లో ఉండాలని ఆయన తెలిపారు.  కానీ వంద రోజులైనా తర్వాత.. దాన్ని అప్లోడ్ ఎందుకు చేశారని... నిలదీశారు. తన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. మరి దీనిపై.. ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: