దేశ వ్యాప్తంగా జెమిలి ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో...  ప్రముఖ నటుడు, మక్కల్ నిధి మయ్యం అధ్యక్షుడు  కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు... కరోనా మహమ్మారి కంటే డేంజర్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.  తాజాగా జంబ్లీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

కేంద్ర కేబినెట్ ఈ బిల్లుపై ఆమోదం తెలిపి... రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి ఈ బిల్లును సమర్థించి పార్లమెంటుకు పంపి ఛాన్స్ ఉంటుంది. అంటే 2027 లోపు.. ఏ క్షణమైన దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ జమ్మిలి ఎన్నికలు జరిగితే.... చాలావరకు నష్టాలు జరుగుతాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ ఎక్కడ కనిపించదు. రాష్ట్రాల సమస్యలు కూడా తెరపైకి రావు.  కేవలం జాతీయ సమస్యలు మాత్రమే తెరపైకి వస్తాయి.

 
దీంతో ఈ జమిలి ఎన్నికలను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోతుందని..ఇలా ఇప్పుడే జమిలి ఎన్నికలకు కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో కమలహాసన్ కూడా మాట్లాడారు. జమిలి ఎన్నికలు...ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే నియంతృత్వ పాలన అవుతుందని కూడా... చెప్పుకొచ్చారు కమల్ హాసన్.

 
2014లో ఇదే తరహా ఎన్నికలు జరిగి ఉంటే దేశం ప్రమాదంలోనే పడేదన్నారు. ప్రతి ఒక్కరూ ఏకతాటి పైకి వచ్చి ఈ.. జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాలని కోరారు.  కరోనా కంటే ప్రమాదకరమైన ఈ జమిలి ఎన్నికలను అందరూ బహిష్కరించాలని తెలిపారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం వీటి నిర్వహణ అస్సలు సాధ్యం కాదని కూడా ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగంలో ఐదు సవరణలు చేస్తే కానీ.. ఇది జరగదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: