వీరిద్దరూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిశారు. జనసేనలో కూడా చేరిపోనున్నారు. వీరిద్దరు జనసేనలో చేరేందుకు జనసేన అధినేత.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పేశారు. తాము ఎందుకు వైసీపీని వేడాల్సి వచ్చిందో వారు నేరుగా పవన్ కు చెప్పారు. ఈ క్రమంలోనే వారిద్దరూ జనసేనలో చేరుతుండడంతో ఒంగోలు, జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పవన్ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఇద్దరు కీలక నేతలకు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని.. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే గా ఉన్న బాలినేని గతంలో వైఎస్ఆర్.. ఆ తర్వాత జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన సామినేని ఉదయభాను.. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు. వైయస్ హయాంలో.. ఆ తర్వాత జగన్ హయాంలో ఎమ్మెల్యేగా.. ప్రభుత్వ విప్ గా పనిచేశారు ఉదయభాను. సీనియారిటీ కోటాలో తనకు జగన్ కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకుంటే.. జగన్ ఇవ్వలేదు. ఇక జనసేనలో చేరుతున్న ఈ ఇద్దరు నేతలకు.. అక్కడ పవన్ రాచ మర్యాదలు కల్పించడం కాయంగా కనిపిస్తోంది.