- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

వైసీపీ 2019 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ తో అధికారంలోకి రావ‌డంలో ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క పాత్ర పోషించారు. అప్ప‌టికే ప్ర‌శాంత్ కిషోర్ తిరుగులేని స్ట్రాట‌జిస్ట్ . అధికారంలోకి వ‌చ్చాక కూడా జ‌గ‌న్ కొన్నాళ్ల పాటు ప్ర‌శాంత్ కిషోర్ ను కంటిన్యూ చేశారు. ఆ త‌ర్వాత పీకే జ‌గ‌న్ చేస్తోన్న కొన్ని ప్ర‌జా వ్య‌తిరేక విధానాల గురించి చెప్పారు. సంక్షేమ‌మే ముఖ్యం కాదు... అభివృద్ధి కూడా ఉండాల‌ని చెప్ప‌డం మొద‌లు పెట్టారు. ఇది స‌హ‌జంగానే జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేదు. పీకేను క్ర‌మ క్ర‌మంగా సైడ్ చేసి ప‌డేశారు. ఆ త‌ర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా జ‌గ‌న్ ను వదిలేశారు.. ఆయన టీమ్ నుంచి వచ్చిన రిషిసింగ్ జ‌గ‌న్ తో పాటు వైసీపీ వాళ్ల‌ను భ్ర‌మ‌ల్లో ఉంచి.. పార్టీని 2024 ఎన్నిక‌ల్లో నిండా ముంచేశారు.


వారు వీరు కాదని.. సాయిదత్ అనే వ్యక్తిని తెచ్చి స్ట్రాటజిస్ట్ అని తెచ్చి పెట్టి... ఆయ‌న‌కు ఓ కొత్త బోర్డు తగలించారు. కానీ విషయం ఏమిటంటే.. ఆ స్ట్రాటజిస్టుకు కూడా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని తెలుస్తోంది. ఇక సజ్జ‌ల చెప్పినట్లే సాయిదత్ చేయాలి. వైసీపీలో ఇప్పుడీ వ్యవహారం మామూలు కాక రేప‌డం లేదు. మొన్న ఎన్నిక‌ల్లో వైసీపీని పాతాళంలోకి తీసుకెళ్లిపోయిన వారిలో ముఖ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని ఎక్కువ మంది .. ఇంకా చెప్పాలి అంటే ఆ పార్టీ వాళ్లే చెపుతారు.


అస‌లు సజ్జ‌ల స‌ల‌హాల వ‌ల్లే పార్టీ నిండా మునిగి పోయింద‌ని. . ఆయ‌న ను పూర్తిగా న‌మ్మే జ‌గ‌న్ మునిగి పోయాడ‌ని అంటారు... స‌జ్జ‌ల స‌రిపోడు అన్న‌ట్టుగా పండిత పుత్ర పరమశుంఠలాగా స‌జ్జ‌ల తాను మాత్ర‌మే కాకుండా.. త‌న‌ కుమారుడ్ని తెచ్చి సోషల్ మీడియా టీమ్ ను కూడా నిర్వీర్యం చేశారని ఆయన పై పీకల మీద దాకా కోపం వైసీపీ వాళ్ల‌కు ఉంది. ఇప్పుడు సాయిద‌త్ అనే వ్య‌క్తిని తీసుకు వ‌చ్చి స్ట్రాట‌జిస్ట్ గా పెట్టి మ‌రోసారి పార్టీని ముంచుతార‌ని వైసీపీ వాళ్ల ఆవేద‌న‌.

మరింత సమాచారం తెలుసుకోండి: