ఒంగోలులో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తంగా మారుతున్నాయి.. వైసిపిలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. దీంతో ఇప్పుడు కూటమినేతల మధ్య భాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది.ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కు, బాలినేని శ్రీనివాస్ మధ్య ఒక పొలిటికల్ వార్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.కూటమి పార్టీలోకి బాలినేని శ్రీనివాస్ ఏంట్రీ ఇవ్వడంతో ఇక అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటారు అనుకుంటున్నా సమయంలో కానీ అనుకోకుండా వీరిమధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది.


బాలినేని జనసేన పార్టీలోకి రావడం విషయం పైన స్వాగతిస్తూ ఆయన అభిమానులు ఒక ఫ్లెక్సీ ని శనివారం రోజున ఏర్పాటు చేశారు.. అందులో చిరంజీవి టిడిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,పవన్ కళ్యాణ్, బాలినేని వంటి వారి ఫోటోలు ఉన్నాయట.. ఈ ఫ్లెక్సీ ల పై దామచర్ల అనుచరులు ఆగ్రహాన్ని తెలియజేశారు. ఫ్లెక్సీ ని కూడా తొలగించేశారు. దామచర్ల మాట్లాడుతూ.. అధికారం ఉన్నప్పుడు తమ మీద పెట్టిన కేసులు మర్చిపోనని బాలినేని ఆయన కుమారుడు చేసిన అవినీతి కేసులు ఎదురుకోక తప్పదని ఆ కేసుల నుంచి ఎవరు తమని రక్షించలేనంటూ. ఎమ్మెల్యే  దామచర్ల   సెటైర్లు వేస్తే తెలియజేశారు.


అలాగే తనమీద చేసిన అవినీతి ఆరోపణలను కూడా విచారణ చరపాలి అంటూ దామచర్ల వ్యాఖ్యల పైన కూడా బాలినేని ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.. ఈ విషయం పైన చంద్రబాబుకు కూడా ఒక లేఖ రాశాననీ అంటూ వెల్లడించారు బాలినేని. తన మీద ఉన్న కేసుల నుంచి తనని పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా కాపాడాలేరని మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందంటూ బాలినేని తెలియజేశారు. ఇంకా జనసేన పార్టీలోకి చేరకముందే ఈయన పరిస్థితి ఇలా ఉందంటే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: