ఒంగోలు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీనికి కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరడమే. తాజాగా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పిన.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి... ఈనెల 26వ తేదీన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్చలు కూడా జరిపారు.

ఇందులో భాగంగానే తాజాగా... ఒంగోలు నియోజకవర్గంలో ఒక కీలక సమావేశం నిర్వహించుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఈ సమావేశమే ఒంగోలు జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపింది.  ఈ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో జనసేన అలాగే టిడిపి నాయకులం ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టించారు బాలినేని అనుచరులు. కానీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్ ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టించలేదట.

 గతంలోనే బాలినేని వర్సెస్ దామరచర్ల జనార్ధన్ మధ్య వివాదాలు ఉన్నాయి. అలాంటిది.. ఇప్పుడు కూటమిలోకి.. బాలినేని శ్రీనివాసరెడ్డి రావడం..  పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు టిడిపి ఎమ్మెల్యే దామరచర్ల జనార్ధన్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి కేసులు పెట్టించాడని దామరచర్ల జనార్దన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.  బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భారీ అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.

 అలాంటి వారిని.. కూటమి రక్షించదని ఆయన హెచ్చరించడం జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుకు.. ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు టిడిపి ఎమ్మెల్యే. అయితే దీనిపై తగ్గేది లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు.  టిడిపి ఎమ్మెల్యే పట్ల సీరియస్ గా స్పందించిన బాయనేని శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో జనసేనలో కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సుఖం లేదని వైసీపీ నేతలు సెటైర్లు పేల్చుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: