లడ్డూ వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారి తీస్తోంది. జాతీయ స్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారనే వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యాతయుత పిలుపునిచ్చారు.


ఆయన చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో సైతం వైరల్ గా మారింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను ప్రత్యే చట్టంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై నేషనల్ లెవల్ లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ వ్యవస్థ ఏర్పాటు అనేది ఇతర మతాలకు వ్యతిరేకం కాదని కూడా పవన్ తేల్చి చెప్పారు. మరోవైపు వైసీపీ హయాంలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని బయట పెట్టడంలో పవన్ విజయవంతం అయ్యారు. 


ఈ విషయంలో జగన్ ను ఢిపెన్స్ లో పెట్టారు. తాజాగా పవన్ ప్రాయాశ్చిత్త దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగించనున్నారు. చివరి రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొని దీనిని ముగించనున్నారు. దీక్షను స్వీకరించిన సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లుగా తిరుమలలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించిందన్నారు.  దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పిలుపునిచ్చారు.


లడ్డూ ప్రసాదం విషయంలో ఏదో జరుగుతోందని గతంలోనే అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట కోట్లాది రూపాయలు గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. చివరలు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నారని అని ప్రశ్నించారు.  ఏది ఏమైనా పవన్ జగన్ ను పూర్తిగా ఢిపెన్స్ లో పడేశారు అని విశ్లేషకులు అంటున్నారు. జగన్ హయాంలో వైఫల్యాలను గుర్తు చేస్తూనే.. జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సనాతన ధర్మ పరిరక్షణ కోసం గళం ఎత్తారు. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: