ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి.. ఎవరు ఊహించని ఓటమి ఎదురైంది. కేవలం 11 స్థానాలకే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితం కావడం మనం చూసాం. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు దక్కాయి. దీంతో ఏపీలో అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ.

అయితే ఓటమి బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అదే సమయంలో వైసీపీ పార్టీలో ఉన్న నేతలందరూ ఇప్పుడు బయటకు వెళ్తున్నారు. ఆళ్ల నానితోపాటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లారు. అటు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు మరియు మోపిదేవి వెంకటరమణ  కూడా బిజెపి లేదా టిడిపిలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి వైసీపీకి గుడ్బై చెప్పారు.

 ఇంకా చాలామంది వైసీపీ పార్టీని వీడి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కూడా త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు సమాచారం. ఆయన ఏబీవీపీ భావాలు ఉన్న వ్యక్తి. ప్రస్తుత పరిస్థితులలో.. వైసీపీకి రాజీనామా చేసి బిజెపిలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ పెద్దలతో కూడా చర్చలు నిర్వహించారట ఆర్ కృష్ణయ్య.

ఆర్ కృష్ణయ్యతో పాటు మరో ముగ్గురు ఎంపీలు కూడా జంప్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ముగ్గురు ఎంపీలు రాజ్యసభకు చెందినవారా లేక లోక్సభకు చెందిన వార అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే నలుగురు పార్లమెంటు సభ్యులు మాత్రం వైసీపీని వీడేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆర్ కృష్ణయ్య పార్టీ మారబోతున్నారని వార్తలు వచ్చాయి.కానీ అప్పుడు ఆర్ కృష్ణయ్య స్వయంగా మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించారు. మరి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: