ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాక అలాగే ఓటమిపాలైన నేతలు కూడా జారుకుంటున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దొరబాబు అలాగే మోపిదేవి, మస్తాన్ రావు లాంటి కీలక నేతలు అందరూ జంప్ అయ్యారు. బయటికి వెళ్లిన నేతలు అందరూ జనసేనలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మెడకు తిరుమల లడ్డు వివాదం...చుట్టుకుంది.
తిరుమలలో జంతువుల కొవ్వును వాడుతున్నారని స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటంతో... ఇది వివాదం రాజుకుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ ఏకీపారేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... వైయస్ జగన్మోహన్ రెడ్డి మతం అలాగే కులం పైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.
క్రైస్తవ మతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డి కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ తాత.. బ్రిటీషర్లకు పంది మాంసం సప్లై చేశాడని కూడా ఆరోపణలు చేశారు. అప్పట్లో తిరుమల కొండపైన వైయస్ రాజశేఖర్ రెడ్డి అరాచకాలు చేస్తే... ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారని మండిపడ్డారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. క్రైస్తవ కులానికి చెందిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల సాంప్రదాయాలు ఏం తెలుస్తాయని నిలదీశారు. తిరుమలను అపవిత్రం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలా వైసీపీ నేతలు స్పందిస్తారో చూడాలి.