* అమెరికా అంటేనే భయపడుతున్న భారతీయ విద్యార్థులు

* అగ్రరాజ్యం వీసా ప్రాసెస్ మరింత కఠినం

* అన్నీ వున్నా ఆదిలోనే హంసపాదు.. భారతీయుల కష్టాలు వర్ణనాతీతం ..


ప్రస్తుతం భారత దేశ  విద్యార్థులు ఉన్నత విద్య కోసం  విదేశాలకు వెళ్తున్నారు.ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే.. దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తోంది. భారతదేశం నుండి వెళ్లిన చాలామంది చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిర పడినవారు వున్నారు.కానీ కొన్ని దేశాలు స్టడీ వీసాల్లో భారీగా కోత విధిస్తున్నాయి.. దీనితో భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య కల గానే మారుతుంది. అగ్ర రాజ్యం అమెరికా లో అయితే వీసా ప్రాసెస్ దారుణం.. అతి కష్టం మీద వీసా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని అమెరికా బయలుదేరిన విద్యార్థులకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగులుతుంది. వీసా ప్రాసెస్ పూర్తి అయింది... అలాగే యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‌ కూడా ఖరారైంది. ఇతర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయ్‌.అయినా కూడా అమెరికా లో ల్యాండ్‌ అయ్యాక భారతీయ విద్యార్థులు ఊహించని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. సరైన కారణం చెప్పకుండానే తమని డిపోర్ట్‌ చేశారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అయితే డిపోర్ట్ అయిన విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం.. వాళ్లందరినీ ఇమిగ్రేషన్‌ చెకింగ్స్‌ తర్వాత చిన్న గదిలో ఉంచి ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదట.గట్టిగా మాట్లాడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.…ఎన్నో ఆశలతో అమెరికా లో అడుగు పెట్టిన తెలుగు విద్యార్థులకూ ఆదిలోనే షాక్ తగిలింది. సరైన పత్రాలు లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే  21 మంది విద్యార్థుల్ని వెనక్కి పంపించేశారు. వాళ్లు ఏ ఎయిర్‌పోర్ట్‌లో దిగారో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీకి రిటర్న్‌ అవ్వాల్సి వచ్చింది.అమెరికా వెళ్లడానికి వీసా నిబంధనలు ఎంతో కఠినంగా ఉంటాయి. ఒకసారి కనుక డిపోర్ట్ చేస్తే 5 ఏళ్లపాటు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం కోల్పోతారు. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఎంతో మంది ఇక్కడ ఉద్యోగాలు వదులుకుని లక్షల్లో అప్పులు చేసి మరీ అమెరికా వెళ్లారు. తీరా అక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి రావాల్సి రావడంతో వారి భాధ వర్ణనాతీతం.. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి . మరికొన్ని ఎయిర్‌పోర్టుల్లో కూడా ల్యాండ్ అయిన కొందరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది.. ఇమిగ్రేషన్‌ చెక్ తర్వాత ఎయిర్‌పోర్ట్స్‌ నుంచే రిటర్న్‌ ఫ్లైట్‌లో వాళ్లను తిరిగి ఢిల్లీకి పంపించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: