ప్రపంచ దేశాల్లో అమెరికా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. అమెరికాలో ఉద్యోగం సాధిస్తే కెరీర్ మారిపోతుందని చాలామంది ఫీలవుతారు. అమెరికా పౌరులకు దక్కే గౌరవం సైతం అంతాఇంతా కాదు. అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన వాళ్లు కోకొల్లలు. అయితే ఊహల్లో కనిపించే అమెరికాకు అసలైన అమెరికాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అమెరికాలో చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ప్రపంచ దేశాలతో పాటు అమెరికాపై కూడా ఆర్థిక మాంద్యం ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. ఆర్థిక ఒత్తిడి వల్ల శారీరక, మానసిక సమస్యలతో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికన్లలో చాలామంది ఆర్థిక భయాన్ని అనుభవిస్తూ ఉండటం గమనార్హం.
 
జీవన వ్యయంలో వచ్చిన మార్పుల వల్ల చాలామందిని తీవ్ర మానసిక సమస్యల బారిన పడుతున్నారు. అధిక ఖర్చులు, మారుతున్న జీవనశైలి వల్ల ఎంత ఆదాయం వచ్చినా సరిపోని పరిస్థితి నెలకొంది. కొంతమందిలో పదవీ విరమణకు సంబంధించిన అనిశ్చితి ఏర్పడింది. తక్కువ వేతనాలు ఉన్నవాళ్లను ఎక్కువగా ఈ ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయని చెప్పవచ్చు.
 
అమెరికాలో జీవించే వాళ్లలో కొంతమంది తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడుతుంటే మరి కొందరు ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెబుతుండటం కొసమెరుపు. అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు మన దేశంతో పోల్చి చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అమెరికాలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా పేరు వింటే అమ్మోరికా అని భయందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అమెరికాలో ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో యువత అమెరికాకు వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: