-అమెరికా వెళ్లినా కొలువులు సున్నా..
- అగ్రరాజ్యంలో ఇండియన్స్ ఆశలు ఆవిరి..
- పేరుకే అగ్రరాజ్యం కానీ ఆర్థిక సంక్షోభం.
- ఆశలతో వెళ్లిన విద్యార్థులకు నిరాశే..



 ఒకప్పుడు అమెరికా చదువు అమెరికా జాబ్ అంటే  ఏదో సిటీలో ఉండేవారు తెలిసిన వారే వెళ్లేవారు. కానీ ప్రస్తుత కాలంలో మారుమూల పల్లెటూరు నుంచి కూడా అగ్రరాజ్యంలో ఎంతో మంది అడుగుపెడుతున్నారు. దీంతో ఉద్యోగాలకు మించి  విద్యార్థులు ఉండడంతో  చాలామందికి జాబులు దొరక్క అక్కడ అనేక ఇక్కట్లు పడుతున్నారు. చివరికి పెట్రోల్ బంకులు, గేట్ కీపర్లుగా , మాల్స్ వంటి  వాటిల్లో జాబులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో  ఇప్పుడు తెలుసుకుందాం..

 అగ్రరాజ్యంలో ఆర్తనాదాలు :

 అమెరికాకు చాలామంది మాస్టర్ డిగ్రీ చేయడం కోసమే వెళ్తూ ఉంటారు. రెండు సంవత్సరాల్లో ఈ కోర్స్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఉద్యోగం లభిస్తుందా అంటే కష్టమే  అని చెప్పవచ్చు. సాధారణంగా అమెరికాలో అడుగుపెట్టే ప్రతి భారతీయుడు హెచ్ వన్ బి వీసా. అమెరికా 85000 వీసాలను విడుదల చేస్తుంది. కానీ అప్లికేషన్లు లక్షల్లో వస్తుంటాయి. అక్కడ హెచ్ వన్ బి వీసా పొందిన వారు కూడా జాబులు కోల్పోయి ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నారట. కొత్తగా వెళ్లిన వారి పరిస్థితి మరీ దారుణం. కొంతమంది మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందుతున్నారట. దీనివల్ల అక్కడ కంపెనీల వారికి దొరికిపోతే వారి వీసాను క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్లకుండా   చేస్తున్నారని అక్కడ ఉద్యోగాలు చేసే టెక్ నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇలా ఇల్లీగల్ జాబ్స్ చేసే బదులు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చి జాబులు వెతుక్కోవడం మంచిదని ఇక్కడ కూడా అనేక జాబులు దొరుకుతున్నాయని తెలియజేస్తున్నారు.


చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు, స్టెమ్ ఓ పి టి వీసా తో 12 నెలలు ప్రాక్టికల్స్ అదనంగా 24 నెలల సమయం ఈ ప్రోగ్రాం ద్వారా పొందవచ్చట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన వారికి నైపుణ్యాలు పెంచుకోవడానికి రూపొందించారట. దీన్ని ఆధారంగా చేసుకున్న లక్షలాదిమంది విద్యార్థులు ఉద్యోగం లేకున్నా కానీ వివిధ కోర్సులు చేస్తూ కాలం గడుపుతున్నారని అనేక సంస్థలు చెబుతున్నాయి. అయినా ఉద్యోగాలు దొరక్క పోవడంతో స్టెమ్ ఓ పి టి వీసా సమయాన్ని 24 నెలల నుంచి 48 నెలలు పొడగించాలని కోరుతున్నారట. అసలు ఉద్యోగాలు లేనప్పుడు దాన్ని ఎన్ని రోజులు పోడగించిన లాభమేమి లేదని అక్కడ ఉద్యోగాలు చేసే సీనియర్ నిపుణులు అంటున్నారు. ఈ స్టెమ్ ఓ పి టి వీసా పొందాలంటే మళ్ళీ వెయ్యి డాలర్ల ఖర్చు చేసే కంటే   చదువు పూర్తయిన వెంటనే ఇండియాకి వెళ్లి జాబ్ చూసుకోవడం మంచిదని వారు అంటున్నారు. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునేవారు ఇవన్నీ ముందుగానే గ్రహించుకొని అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: