•విదేశీ విద్య.. భారత విద్యార్థులకు కలగా మారనుందా..

•కెనడా ప్రభుత్వ నిర్ణయానికి భారత విద్యార్థులు విలవిల

•మరి భారత విద్యార్థుల కలలు నెరవేరేదెన్నడు..



విదేశాలలో టాయిలెట్స్ శుభ్రం చేసినా సరే ఇక్కడి వారికి గర్వంగా చెప్పుకోవచ్చు అనే అపోహ కారణంగా చాలామంది విదేశీ యానం చేస్తూ అక్కడ పడరాని కష్టం పడుతూ.. ఎందుకు వచ్చాం రా అన్నట్టుగా అక్కడి జీవనం తెలుగువారిని ఇబ్బంది పెడుతోంది..  ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాలంటే కూడా వీసా కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విద్యార్థులే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు విదేశాలలో చదువుకోవాలని,  ఉన్నత చదువులు చదివి బాగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నార.. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


నిజానికి దశాబ్దాల తరబడి ఉన్నత విద్య కోసం మన దేశానికి చెందిన లక్షలాదిమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు.  అక్కడే చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వెతుక్కొని స్థిరపడిపోతున్నారు. కానీ కొన్ని దేశాలు స్టడీ వీసాల్లో భారీగా కోత విధిస్తూ ఉండడం ద్వారా భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కెనడా, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కెనడా , ఆస్ట్రేలియా వంటి దేశాలు వీసా నిబంధనలను కఠిన తరం చేయడం వల్ల ఇతర దేశాలు ముఖ్యంగా భారత విద్యార్థుల ఆశలు,  అవకాశాలపై నీళ్లు చల్లుతున్నాయని చెప్పవచ్చు.

కెనడా అధికారంలో ఉన్న జస్టిస్ ట్రూడో ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మన భారత విద్యార్థులకు ఇబ్బందులు కలగజేస్తోంది. ఈ క్రమంలోనే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎక్కువగా మన భారత విద్యార్థులపైనే ప్రభావితం చూపిస్తోంది విదేశీ విద్యార్థులకు వారానికి 40 గంటలు ఉన్న వర్క్ పర్మిట్ ను  ఇప్పటికే 20 గంటలకు తగ్గించిన కెనడా సర్కార్ భారతీయ విద్యార్థుల సంఖ్యను కూడా 50% వరకు తగ్గించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని కెనడా ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ అప్లై బోర్డ్ నివేదించగా అక్కడ చదువుకోవాలని విద్యార్థుల కష్టాలు మరింత పెరగనున్నాయి.

దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరత , నిరుద్యోగ సమస్యను అదుపు చేయడానికి కన్నడ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందట. ప్రభుత్వం 4.36లక్షల స్టడీ వీసాలు జారీ చేయగా.. ఏడాది 2.31 లక్షలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఇక ముందు ముందు ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది .మొత్తానికైతే విదేశాలలో చదువుకోవాలనుకుంటున్న మన విద్యార్థులకు ఈ విషయం వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: