అయితే ఇలాంటి నేపథ్యంలో పానకంలో పుడకలాగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పెను సంచలనాన్ని సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇకపై ముఖ్యమంత్రి కాబోడని..తెలంగాణకు ఇక బిసి సామాజిక వర్గానికి చెందిన వాడే ముఖ్యమంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న తాజాగా ప్రకటించారు. లేటెస్ట్ గా బీసీ సంక్షేమ సంఘం సదస్సుకు హాజరైన తీన్మార్ మల్లన్న.. రేవంత్ రెడ్డి పై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అన్ని పార్టీలు బీసీలను వాడుకొని.. రెడ్డిలు అలాగే రావులకు అధికారం కట్టబెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఫైల్ రేవంత్ రెడ్డి దగ్గరే ఉందని.. దానిపైన సంతకం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ ఫైల్ పైన సంతకం చేయకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
2028 లో ఖచ్చితంగా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని కూడా ప్రకటించారు తీన్మార్ మల్లన్న. దీంతో రేవంత్ రెడ్డి వర్గంలో కొత్త అలజడి మొదలైంది. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉత్తంకుమార్ రెడ్డి లు సీఎం పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఈ ఇద్దరు మంత్రులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందు తుంది.