ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారని తమిళ్‌ హీరో కార్తీ పై ఫైర్‌ అయ్యారు. నిన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో లడ్డూ గురించి నేను మాట్లాడను.. ఇప్పుడేం మాట్లాడినా.. సెన్సిటివ్‌ అవుతుందని సరదగా మాట్లాడారు. అయితే...హీరో కార్తీ అలా మాట్లాడిన నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహించారు. భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా అంటూ ప్రశ్నించారు.


ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం అంటూ వ్యాఖ్యానించారు పవన్. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి...ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. ఇవాళ విజయవాడ అమ్మవారిని దర్శించుకుని.. ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... భూమన కరుణాకర రెడ్డి గారి నాశనం మొదలైందని ఆగ్రహించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కూడా విచారణకు రావాలని కోరారు. ధర్మారెడ్డి మాయమైపోయారని ప్రశ్నించారు. ధర్మారెడ్డి హిందువా.. బిడ్డ చనిపోయిన పడకొండు రోజుల్లోపు గుడికి వచ్చేస్తారా ? అని ఆగ్రహించారు.

ఇస్లాం, ముస్లిం లకు జరిగితే ఇలాగే ఉంటారా అని నిలదీశారు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే.. చనిపోవడానికి సిద్ధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వాన్ని పడకొట్టిన మేము.. ఏమీ చేయలేం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. మీ మౌనంతో తరాలు నాశనం అయిపోతాయన్నారు. జగన్ ను నేను ఎత్తి చూపడం లేదని ఆగ్రహించారు.


మీ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని కోరారు.  రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలని కోరారు.  సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలని వెల్లడించారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అంటూ మండిపడ్డారు ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాష్‌రాజ్‌ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: