వినిపిస్తున్నాయి. నిజానికి వైఎస్ జగన్ హయాంలో వైసీపీలో కొనసాగిన మోహన్ బాబు పార్టీకి ఎన్నో సేవలు చేశారు. అయితే ఆ సమయంలో జగన్ వీరిని పట్టించుకోకపోవడం, టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కకపోవడంతో నిరాశ చెందారు మోహన్ బాబు. అంతేకాదు జగన్ తో విభేదాలు రావడంతో గత కొన్ని రోజులుగా పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు
అయితే ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి లడ్డు కల్తీ విషయంలో చంద్రబాబు ను పొగుడుతూ మోహన్ బాబు విడుదల చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నా ప్రియ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు నిండు నూరేళ్లు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను లడ్డు కల్తీ విషయంలో అపచారం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను అంటూ తెలిసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికైతే గతంలో చంద్రబాబును తిట్టిన మోహన్ బాబు ఇదే సందు అనుకుని ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ టిడిపిలోకి దూరిపోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం
నిజానికి గతంలో మోహన్ బాబు టిడిపిలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. టిడిపి కోసం ప్రచారం కూడా చేశారు కానీ అక్కడ అనుకోని పరిస్థితుల వల్ల పార్టీని వీడి వైసీపీకిలోకి చేరారు. దీనికి తోడు మంచు విష్ణు వైయస్సార్ కుటుంబానికి అల్లుడు కావడంతో వైసిపిలో కొంతకాలం కొనసాగారు. కానీ అక్కడ విభేదాలు వచ్చాయి. వివాహం చేసుకున్న తర్వాత మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ టిడిపిలో కొనసాగుతున్నారు. అందుకే ఇప్పుడు మోహన్ బాబు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని లడ్డూ నెపంతో టిడిపిలోకి చేరిపోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.