తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా అనవసర జోలికిపోయి ఉన్న పరువును కాస్త పోగొట్టుకుందని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా ఈమె చేసిన పనికి నెటిజెన్స్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ 18వ తేదీ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్వామి వారి కోసం తయారు చేసే లడ్డూ లో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు గొడ్డు మాంసం వాడారు అంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రోజా తన యూట్యూబ్ ఛానల్ లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై పోల్  నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజా కి నెటిజెన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తిరుపతి లడ్డూ లో కల్తీ చేసింది ఎవరు..? అంటూ రోజా తన యూట్యూబ్ ఛానల్ లో ఒక పోల్ నిర్వహించింది. అంతేకాదు మాజీ సీఎం వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ పేర్లను కూడా ఆప్షన్స్ లో పెట్టింది. దీంతో నెటిజన్స్ మాజీ సీఎం వైఎస్ జగన్ దే తప్పంటూ 74 శాతం మందికి పైగా నెటిజెన్లు ఓటు వేశారు.

ఇక ఎవరి పాలనలో తిరుపతి బాగుందంటూ ఆమె పోల్ నిర్వహించగా.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే తిరుపతి బాగుందంటూ 77% మందికిపైగా ఓటు వేశారు. మొత్తానికైతే నెటిజెన్స్ ను కెలికి మరీ పరువు తీయించుకుంది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తిరుమల లో కొలువు తీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఎన్ డి డి బి నివేదిక స్పష్టం చేయగా.. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: